Balakrishna: బాలయ్యను క్షమాపణ కోరిన ఐపీఎస్ అధికారి.. ఎందుకంటే

Balakrishna

Balakrishna: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సెప్టెంబర్ నెలలో సీవీ ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్నసమయంలో సిటీ పోలీసులు అతిపెద్ద సినిమా పైరసీ రాకెట్‌ని పట్టుకున్నారు. ఇందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో సీవీ ఆనంద్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో పాటు పలువురు నిర్మాతలు హజరయ్యారు. పైరసీ గ్యాంగులు ఉపయోగించిన పద్ధతులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, ఇండస్ట్రీ-పోలీసుల మధ్య సమన్వయంపై విశ్లేషణ జరిగింది. ఈ మీటింగ్‌కు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ పోస్టుపై ఆ తర్వాత అనుకోకుండా పెద్ద వివాదం మొదలైంది.

Balakrishna: సీవీ ఆనంద్ పోస్ట్‌పై ఒక నెటిజన్ వ్యంగ్యంగా “బాలకృష్ణను కూడా పిలవండి, లేదంటే ఆయన అసెంబ్లీలో అడుగుతారు” అని కామెంట్ చేశాడు. ఆ కామెంట్‌కి సీవీ ఆనంద్ అకౌంట్ నుంచి ఒక స్మైలీ ఎమోజీతో రిప్లై వెళ్లింది. ఆ ఎమోజీనే బాలయ్య అభిమానుల్లో ఆగ్రహాన్ని రగిలించింది. అగ్రనటుడు, మూడుసార్లు ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గురించి ఇలా స్పందించడం సరికాదని, వెంటనే క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్లు, ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ వివాదం రెండు నెలలుగా సోషల్ మీడియాలో కొనసాగుతుండగా సీవీ ఆనంద్ తాజాగా స్పందిస్తూ దీనిపై వివరణ ఇచ్చారు.

Balakrishna: తన ట్వీట్‌లో సీవీ ఆనంద్, ఆ ఎమోజీకి కారణం తాను కాదని చెప్పారు. సమయం లేకపోవడం వల్ల ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను నిర్వహించడానికి ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్‌ను పెట్టుకున్నానని, సెప్టెంబర్ 29న ప్రెస్ మీట్ అనంతరం అదే వ్యక్తి ఆ స్మైలీ ఎమోజీని రిప్లైగా పెట్టాడని తెలిపారు. అది తన అనుమతి లేకుండా చేసిన పని అని, ఈ విషయాన్ని తాను వెంటనే తెలుసుకోలేకపోయానని చెప్పారు. దాని గురించి తెలిసిన వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేసి, పూర్తి వివరాలు తెలుసుకున్నానని వెల్లడించారు. బాలకృష్ణతో తనకు చానాళ్లుగా పరిచయం ఉన్నందున వ్యక్తిగతంగా ఆయనకు మెసేజ్‌ చేసి బాధ కలిగించి ఉంటే క్షమించాలని కోరినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *