Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కి బంపర్ అప్డేట్.. ఆది నిజమైతే ఇక బాక్సాఫీస్ బద్దలే!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘స్పిరిట్’. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ పోలీస్ యాక్షన్ డ్రామా ఇటీవలే వేడుకగా లాంఛ్ అయింది. హైదరాబాద్‌లో జరిగింది ముహూర్త కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరై టీం సభ్యులను అభినందించారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన సందీప్, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారు.

Prabhas: ఈ చిత్రంలో యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రల కోసం బాలీవుడ్ నుండి మరిన్ని నటులను కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

ఇక ఈ ప్రాజెక్ట్‌ నుంచి ప్రస్తుతం వెలువడుతున్న హాట్ టాక్ ఏమిటంటే—బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ‘స్పిరిట్’ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపించనున్నాడట. యానిమల్ ద్వారా సందీప్-రణ్‌బీర్ కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో, వారి మధ్య ఏర్పడిన స్నేహం కారణంగానే రణ్‌బీర్ ఈ ప్రత్యేక పాత్రకు ఒప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. సినిమాలోని ఒక ప్రత్యేకమైన, క్లైమాక్స్‌కు దగ్గరగా ఉండే కీలక సన్నివేశంలో ఆయన ఎంట్రీ ఉంటుందని ప్రచారం.

అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ‘స్పిరిట్’ టీం అధికారిక సమాధానం ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రభాస్ మరియు రణ్‌బీర్ కపూర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే అవకాశం ఉన్నందుకు అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇది నిజమైతే, ‘స్పిరిట్’ మరింత భారీ స్థాయిలో చర్చనీయాంశం అవడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *