మక్తల్‌, హిందూపూర్ గ్రామములో ఘనంగా గాంధీజీ 157వ జయంతి వేడుకలు

• డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మునికి పూల మాలలు వేసి ఘన నివాళులు

• గాంధీజీ ఆశయాలను కొనియాడిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డా. మణికంఠ గౌడ్

నారాయణపేట, అక్టోబర్ 2 (జన ఉదయం ప్రతినిధి)

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంతోపాటు కృష్ణా మండలం హిందూపూర్ గ్రామంలో డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద, అలాగే కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భాగస్వామ్యం వహించారు.
మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి అందించిన సేవలు, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను గుర్తుచేసుకున్నారు.
గాంధీజీ ఆశయాలు నేటికీ మార్గదర్శకాలు
ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ,

గాంధీజీ చరిత్రాత్మక పాత్ర…..

మహాత్మా గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చూపిన మార్గం దేశ చరిత్రలో చిరస్మరణీయమని, సత్యం, అహింస, శాంతి అనే సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.

సామాజిక విలువలపై దృష్టి….

గాంధీజీ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, సమాజంలో సమానత్వం, సామరస్యం, పరిశుభ్రత, స్వావలంబన, గ్రామ స్వరాజ్యం వంటి విలువలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.

నేటి తరానికి స్ఫూర్తి…

ఆయన ఆలోచనలు నేటి తరానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని, సత్యం, అహింసతో కూడిన గాంధీజీ మార్గం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

శాంతియుత పరిష్కారం సందేశం…

ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతియుత మార్గంలో సమస్యలను పరిష్కరించుకోవాలనే సందేశాన్ని గాంధీజీ అందించారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించినప్పుడే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు.

యువతకు పిలుపు….

దేశ సమగ్రత, ఐక్యత కోసం గాంధీజీ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రజా సంక్షేమం కోసం పిలుపు…

మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆకాంక్షించారు. గాంధీజీని కేవలం స్వాతంత్ర్య సమరయోధుడిగా మాత్రమే కాకుండా, సామాజిక సంస్కర్త, గ్రామ స్వరాజ్యం వంటి ఆదర్శ సమాజ నిర్మాతగా అభివర్ణించారు. ఆయన ఆశయాలు నేటికీ ప్రసక్తమని, ముఖ్యంగా యువత వీటిని అనుసరించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు…

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎండి సోఫీ బాల్ రెడ్డి, ఉమేష్ భీమేష్, పరశురాం, ఎల్ భీమేష్, చెన్నకేశవులు, బి రాజు, పరశురామ్ గౌడ్, ఖానాపూర్ బాలు, నరేష్, ఆనంద్ మరియు కృష్ణ మండల జనసేన నాయకులు మాడి హనుమంతు, రమేష్, గాడిపే అంజప్ప, చక్రవర్తి, శ్రీకాంత్, తరుణ్, లక్ష్మణ్, సామాజిక కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.