• క్రీడల ఆణిముత్యం జంగిటి శ్రీనిధిని సన్మానించిన కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ
నారాయణపేట, అక్టోబర్ 6( జన ఉదయం ప్రతినిధి)
ముదిరాజ్ ముద్దుబిడ్డగా క్రీడల్లో రాణించి అండర్- 15 రాష్ట్రస్థాయి క్రికెట్ లో చోటు సంపాదించుకున్న జంగిటి శ్రీనిధిని మంగళవారం ఘనంగా సన్మానించారు వార్డు కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ. నారాయణపేట పట్టణంలోని మూడవ వార్డుకు చెందిన జింగిటి శ్రీనిధి పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ప్రతిభావంతమైన క్రికెట్ క్రీడాకారిణి జె. శ్రీనిధి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సి ఏ ) అండర్-15 బాలికల రాష్ట్ర స్థాయి ప్రాబబుల్స్‌కు ఎంపికైన సందర్భంగా కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ వార్డు ప్రజలతో కలిసి జంగిటి శ్రీనిధిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా నారాయణమ్మ మాట్లాడుతూ చిన్న వయసులోనే క్రికెట్లో ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర స్థాయి ఎంపికకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. శ్రీనిధి ని క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు క్రీడ కోచులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చిన్న వయసులోనే శ్రీనిధి రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా నారాయణపేటకు క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని దాంతోపాటు నారాయణపేటకే పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని శ్రీనిధి ని కోరారు .
చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమని, భవిష్యత్తులో శ్రీనిధి మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, నారాయణపేటకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
శ్రీనిధి సాధించిన ఈ ఘనత నారాయణపేటలోని ఇతర బాలికలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనిధి తల్లిదండ్రులు జంగిటి రమేష్, లత, డాక్టరేట్ కాకర్ల భీమయ్య, వార్డు ప్రజలు జంగిటి రవి కుమార్( అట్టు) తిమ్మయ్య గడ్డమీది రాము శివ శ్రీనివాస్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
