షార్ట్‌ సర్క్యూట్‌తో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

• బాధిత కుటుంబాన్ని ఓదారుస్తూ మనోధైర్యాన్ని అందించారు

• మఖ్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి

నారాయణపేట, అక్టోబర్ 11 జన ఉదయం ప్రతినిధి)

నారాయణపేట జిల్లా,మఖ్తల్ నియోజకవర్గం, మాగనూరు మండలం నెరడగం గ్రామంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కురువ శేక్షింది వెంకట్ రాములు ఇల్లు పూర్తిగా దగ్ధమై సర్వం కోల్పోయారు ఆ కుటుంబ సభ్యులు. విషయాన్ని తెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదివారం నేరేడు గ్రామానికి వెళ్లి అట్టి కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న తులం బంగారం,వెండి,నగదు,బియ్యం,నిత్యావసర వస్తువులు సహా ఇంటి సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో బాధిత కుటుంబం తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన వెల్లడించారు.
అగ్నిప్రమాదం జరిగిన తీరును,ఇంట్లోని పరిస్థితులను పరిశీలించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి,జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు.అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలియజేశారు.
అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధితుల తరపున కోరారు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామారెడ్డి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.