సమాజం అనేది వ్యక్తుల
సమూహం అనుబంధాల
సమాహారం ఇటుకల మధ్య
సిమెంట్ ఉంటేనే ఇల్లు
నిలబడినట్లు మనుషుల
మధ్య పరస్పర గౌరవం
ఉంటేనే బంధాలు
నిలబడతాయి
ఒకరినొకరు పరస్పరం
గౌరవించుకోవడం అనేది
ఆరోగ్య కరమైన
సమాజానికి తొలి అడుగు
తోటలో పూసేరంగురంగుల
పూలు ఉన్నట్లు
మనుషుల మనుసులు కూడా
వేర్వేరుగా ఉంటాయి
కానీ తోటమాలి అన్ని పూలను
ఒకేలా ప్రేమించినట్లు
మనం కూడా ఎదుటివారి
ఉనికిని గౌరవించాలి
ప్రకృతిని చూసినేర్చుకోవాలి
చెట్టు భూమిని గౌరవించి
నీడను ఇస్తుంది
భూమి చెట్టును గౌరవించి
పట్టును ఇస్తుంది
ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకునే
ఈగౌరవమే సృష్టి చక్రానికి
అసలైన ఆధారం
ఇంట్లో అమ్మ శ్రమను గుర్తించడం
గౌరవం నాన్న పడే కష్టాన్ని
గౌరవించడం బాధ్యత
కలిసి తిరిగే స్నేహితుల
మధ్య సరదాలు ఉండవచ్చు
కానీ ఒకరి బలహీనతను
మరొకరు గెలిచేయవద్దు
కష్టాల్లో ఉన్నపుడు
ఆదుకోవడం ఎంత ముఖ్యమో
నలుగురిలో ఉన్నపుడు స్నేహితుని
ఆత్మగౌరవాన్ని కాపాడటం
అంతే ముఖ్యం
భార్యాభర్త బంధం ఏడడుగుల
బందంలో ఇద్దరి దారులు ఒకటే
కావచ్చు కానీ ఇద్దరి ఆలోచనలు
ఆశయాలువేరువేరుగాఉండవచ్చు
అధికారం చెలాయించడం కాదు
ఒకరి అభిప్రాయాలు ఒకరు
గౌరవించుకోవడమే నిజమైన
అనుబంధం
భార్యాభర్తల మధ్య స్నేహితుల
మధ్య అధికారం కంటే
ఆదరణ ముఖ్యం.
ఎవరి లోకాలు వారివి
ఎవరి పోరాటాలు వారివి
నువ్వు నడిచేదారికంటే
పక్క వాడి దారి వేరుకావచ్చు
కానీ నీ దారి నీధి నా దారి నాది
అనుకుంటు ఒకరి శ్రమను
ఒకరు తక్కువ చేయకూడదు
మాట జారితే వెనక్కి తీసుకోలేం తూటా కంటే మాట బలమైంది
మనసు గాయపడితే అంత తేలిగ్గా
మానదు
అందుకే మాట్లాడే ముందు కాస్త
ఆలోచిద్దాం
ఎదుటివారి ఆత్మ గౌరవాన్ని
కాపాడుదాం
మాటల వెనుక మర్యాద ఉంటే
మనసుల మధ్య దూరం దానంతట అదే తగ్గుతుంది
స్నేహమైన సంసారమైన
చుట్టరికమైన పరస్పర గౌరవం
అనే పునాది పైననే కాల పరీక్షను తట్టుకొని నిలబడుతుంది
సమాజంలో మార్పు అనేది ఎక్కడో రాదు. మన ఇళ్ల నుంచి మన నుంచే మన మాటల నుంచే మొదలవ్వాలి .ఎదుటివారికి
గౌరవం ఇవ్వడం వల్ల మన విలువ
తగ్గదు సగర్వంగా పెరుగుతుంది.
బంధాలను బతికించుకుందాం
సమాజాన్ని బలోవపేతం చేద్దాం
గౌరవం అనేది ఒక అద్దం
లాంటిది. నువ్వు ఎదుటి వారికి
ఎంత ఇస్తావో నీకు కూడా అంతే
తిరిగివస్తుంది. స్నేహంలోనైనా
సంసారంలోనైనా బంధుత్వంలో నైన ఆఅద్దాన్ని ఎప్పటికీ మసక
బారనివ్వకండి.
ప్రేమ అవగాహన ఆత్మీయత
అనురాగం ఆర్థత సహనం సహకారం అనే తోటలో మానవీయత పరిమళాలను
పూయిస్తాం ఆత్మగౌరవ జెండాను
ఎగిరేద్దాం
నువ్వు ఎంత గౌరవాన్ని
పంచుతావో అంతటి
బలమైన బంధాలను
నీసొంతం చేసుకుంటావు.
గౌరవం ఇచ్చిపుచ్చు
కుందాం
ఆత్మగౌరమే వారధిగా
అనుబంధాల సుస్థిరతలో
సారధిగా ఎదుగుదాం
సమాజంలో మానవీయ
విలువల పరివ్యాప్తితో
మానవ మనుగడ సాధిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎడ్యుకేషన్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771
