Child Education: ఏ ఒక్క చిన్నారి బడి బయట ఉండకూడదు

Child Education

Child Education: చదువుకు దూరం కాకుండా ప్రతి బిడ్డా బడిలోనే ఉండాలని, పొట్టకూటికోసం తల్లిదండ్రులు వలస వెళ్లినా స్థానిక పాఠశాలల్లో లేదా సీజనల్ హాస్టల్ ద్వారా ఆ పిల్లలకు విద్యను అందించడానికి ప్రతి ALSCO (Alternative Schooling Coordinator) చొరవ తీసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో అన్నిజిల్లాల ALSCOలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఎస్పీడీ మాట్లాడుతూ… చదువుకోవాల్సిన వయస్సు గల పిల్లలు కూలీ పనుల్లో, యాచక వృత్తిలో, కనిపించకూడదని అన్నారు. ఏయే ప్రాంతాల నుండి ఎక్కువమంది వలస కార్మికులు వస్తున్నారో ముందుగానే గుర్తించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వలస కూలీల పిల్లలకు సంబంధించి వారి భాషలోనే బోధించేలా స్థానిక భాషా ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించేలా ప్రణాళిక వేసుకోవాలన్నారు. ఆ చిన్నారులకు కనీసం పునాది విద్య అందేలా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ కె.రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *