Health Benefits: ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటింటి నుంచి దాదాపు విడదీయరాని భాగం. అయితే ఇవి నిజంగా ఆరోగ్యానికి మంచివా, కాదు అనే చర్చ చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. తాజాగా ఎయిమ్స్-హార్వర్డ్ శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. శాస్త్రీయ ఆధారాలతో పాటు, దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలతో ఉల్లి–వెల్లుల్లి దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ఆయన తేల్చిచెప్పారు.
పోషకాల పవర్ హౌస్
Health Benefits: డాక్టర్ సేథి ప్రకారం, ఉల్లి మరియు వెల్లుల్లి కాలేయంలో డీటాక్స్ ఎంజైమ్‌లను ఉత్తేజపరుస్తాయి. శరీరం నుంచి హానికరమైన పదార్థాలను బయటకు పంపించడం వీటి వల్ల వేగవంతమవుతుంది. అలాగే ఇవి గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరచి, ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాను పెంపొందిస్తాయి. రోగనిరోధక వ్యవస్థకు స్పష్టమైన సంకేతాలను పంపడంలో కూడా ఈ రెండు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.
క్యాన్సర్ ప్రమాదం తగ్గించడంలో కీలకం
ఉల్లి–వెల్లుల్లి క్యాన్సర్‌పై రక్షణాత్మక పాత్రను దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనలు నిరూపిస్తున్నాయి. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురితమైన పరిశోధనలో, అల్లియం కూరగాయలైన వెల్లుల్లి–ఉల్లిపాయలలో ఉన్న ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ప్రోస్టేట్, కడుపు, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు. రోజూ కనీసం 10 గ్రాముల అల్లియం కూరగాయలు తీసుకునే వ్యక్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు తెలియజేశాయి.
గరిష్ట ప్రయోజనాల కోసం – 10 నిమిషాల రూల్
చాలా మంది వెల్లుల్లిని వెంటనే వంటలో వేసేస్తారు. అయితే డాక్టర్ సేథి చెప్పిన కీలక విషయం ఏమిటంటే—వెల్లుల్లిని దంచిన తర్వాత కనీసం 10 నిమిషాలు ఆగి వంటలో వేసాలి. అలా చేస్తే అల్లిసిన్ అనే శక్తివంతమైన ఆంటీ–క్యాన్సర్ సమ్మేళనం పూర్తిగా తయారవుతుంది. వెంటనే వండితే ఈ సమ్మేళనం పూర్తిగా తయారు కాకపోవడంతో ప్రయోజనం తగ్గిపోతుందని ఆయన వివరించారు.
ఏమంటారు నిపుణులు?
డాక్టర్ సౌరభ్ సేథి స్పష్టంగా చెబుతారు—ఉల్లిపాయలు, వెల్లుల్లి ప్రతిరోజూ నిస్సంకోచంగా తినవచ్చు. డీటాక్స్, హృదయ ఆరోగ్యం, గట్ హెల్త్, క్యాన్సర్ నివారణ వంటి ఆరోగ్య ప్రయోజనాలకు ఇవి అత్యంత కీలకమైన ఆహారాలు.
