నారాయణపేట, సెప్టెంబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)
మరికల్ తహసిల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పరిధిలో కొనసాగుతున్న కార్యకలాపాలపై తహసిల్దార్ రామ్‌కోటిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భూ భారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ఇతర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
కొత్తగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయ భవనం పరిసరాల్లో, ముఖ్యంగా ప్రహరీ చుట్టూ అపరిశుభ్రత నెలకొని ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు
మండలంలో చేపడుతున్న వీ.ఓ. భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని ఎంపీడీఓ పృథ్వీరాజ్‌కు కలెక్టర్ సూచించారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
