– ఆలయంలో ప్రత్యేక పూజలు
నారాయణపేట, సెప్టెంబర్ 11 (జన ఉదయం ప్రతినిధి)
పవిత్ర శ్రావణమాసం నెల రోజులు అనంతరం అమావాస్య సందర్బంగా శుక్రవారం ఆంధ్రాలోని మంత్రాలయం లోగల శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని మక్తల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ సంగం జిల్లా అధ్యక్షులు రాజేందర్ గౌడ్, ఎఎంసీ డైరెక్టర్ వర్కుర్ ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వాకిటి శ్యామ్ కుమార్, భూత్పుర్ చెన్నయ్య గౌడ్ లు దర్శించుకుని స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సంప్రదాయంలో భాగంగా గత నెల రోజులుగా మిస్టర్ నియమాలతో ఉంటూ ఎలాంటి మాంసాహారాలు భుజించకుండా నిత్యం భగవంతుని దర్శించుకుంటూ పూజలు చేయడం హిందూ సాంప్రదాయలో భాగమని వారన్నారు. శ్రావణమాసం చివరి రోజు అయిన అమావాస్య సందర్భంగా ఎంతో పవిత్రమైనటువంటి ఆ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడం తమ జన్మదిన అంటూ వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

శ్రావణమాసంలో నిష్ట నియమాలతో శుద్ధిగా ఆ భగవంతుని కొలిస్తే తప్పకుండా ఆయనకు ఆశీర్వాదాలు మనపై ఉంటాయని వారి సందర్భంగా చెప్పుకొచ్చారు.
