— పరిశుభ్రతకు మారుపేరు మన కార్మికులే
వాకిటి శేషగిరి, కోచ్ జగదీష్ ప్రశంసలు
– మక్తల్ మున్సిపల్ సిబ్బందికి లక్ష అథ్లెటిక్స్ సెంటర్ వేదికగా సత్కారం
– అథ్లెటిక్స్ కార్యక్రమం విజయవంతం; మైదానం శుభ్రం చేసిన కార్మికులకు శాలువా, మెమెంటోతో సన్మానం
నారాయణపేట, సెప్టెంబర్ 13 (జన ఉదయం ప్రతినిధి)
లక్ష అథ్లెటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్స్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన సందర్భంగా కళాశాల మైదానంలో పడిన వ్యర్థాలను ఆదివారం శుభ్రం చేసిన మక్తల్ మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి, శివాజీ వాకింగ్ గ్రూప్ సభ్యులు కలిసి కార్మికులకు శాలువా కప్పి, మెమెంటో అందించి ఘనంగా సత్కరించారు. సత్కరించారు.
వాకిటి శేషగిరి మాట్లాడుతూ….
“లక్ష అథ్లెటిక్స్ సెంటర్ ఆధ్వర్యంలో కార్మికులను అభినందిస్తూ సన్మానించడం ఎంతో గర్వంగా ఉంది. పరిసరాల పరిశుభ్రతకు మారుపేరు మన కార్మికులే” అని కొనియాడారు. కార్మికులు నిరంతర శ్రమజీవులని, వారి సేవలు పట్టణ ఆరోగ్యానికి వెన్నెముక అని ఆయన అన్నారు.
లక్ష అథ్లెటిక్స్ సెంటర్ నిర్వాహకులు, పీఈటీ కోచ్ జగదీష్ మాట్లాడుతూ, “మన చుట్టూ ఉండే పరిసరాలను ప్రతినిత్యం శుభ్రంగా ఉంచేందుకు, పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు కార్మికులు కష్టపడుతున్నారు. వారి సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు. కార్మికుల పని విధానాన్ని అభినందిస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి గుర్తింపు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, , కృష్ణ, అంజయ్య ఆచారి, హన్మంతు, రమేశ్ రావు, పీడీ రాజేశ్వరి, కోచ్ జగదీష్‌తో యాదయ్య పాటు శానిటైజర్ సూపర్వైజర్ దేవరాజు, శానిటేషన్ జవాన్ కృష్ణ, బాలరాజు, ఈదెబ్బ, మహేశ్, బాలమ్మ, కొలిమి పద్మ, అంజమ్మ, లక్ష్మమ్మ, శంకరమ్మ, మహేశ్వరమ్మ, నరసింహ, వెంకటేష్, జీ. హనుమంతు, ఆంజనేయులు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
