- • మక్తల్ పట్టణంలో ఘనంగా గణేశ్ ప్రతిష్టాపన శోభాయాత్ర
• పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి, బిజెపి నాయకులు కొండయ్య, వీహెచ్పీ బజరంగ్దళ్ నాయకులు
నారాయణపేట సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గణనాథుల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ పరిధిలో మొత్తం 50కు పైగావినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోగా, మక్తల్ మండల వ్యాప్తంగా సుమారు 175 గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అలరించిన శోభయాత్ర…
- పడమటి అంజన్న ఆలయం నుంచి కమ్మరి వారి ఇంటి వరకు గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఎట్టి శోభయాత్ర మేళతాళాలు, డప్పువాయిద్యాలు, భక్తి గీతాల నడుమ భక్తులు తోడు గణపతిని పట్టణ పురవీధుల గుండా శోభాయమానంగా తీసుకువచ్చారు. శోభాయాత్ర సాగిన మార్గమంతా భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద భక్తులు భజనలు, కీర్తనలు నిర్వహిస్తూ విఘ్నేశ్వరుడిని భక్తిభావంతో కొలిచారు. యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని గణేశ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

