యుగపురుషుడు నవ భారత రూప శిల్పి మోదీ

(భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వజన్మదిన సందర్భంగా)

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (జన ఉదయం ప్రతినిధి )

గుజరాత్ మట్టిలో
వికసించిన కుసుమం
నరేంద్ర మోదీ
భారతావనికి దొరికిన
అరుదైన విధాత
సవాళ్లను సైతం
అవకాశాలుగా మార్చి
ప్రగతి పాలనను దేశానికి
అందించిన నాయకుడు

మోదీ 25 ఏళ్ల నిరాటంక
ప్రజాపాలనను ప్రపంచంలోని
75 శాతం ప్రజలు మెచ్చిన
ప్రజాస్వామ్య నాయకుడు మోదీ

మోదీ భారత ప్రధానిగా3వసారి
భారత భవితను రచిస్తున్నాడు
ఆధునిక విశ్వఖర్మగా ఖ్యాతి
గాంచాడు

మోదీ 2001 నుండి 2014
వరకు3పర్యాయాలు గుజరాత్
ముఖ్య మంత్రిగా విదేశీ ప్రత్యక్ష
పెట్టుబడులు ఆహ్వానించిన
ఆర్థిక రూపశిల్పి

సబ్ కా సాత్ సాబ్ క వికాస్
సబ్ కా విశ్వాస్ సభ్ కా ప్రయాస్
నినాదంతో సుపరి పాలనను
దేశానికి అందించి దేశాన్ని
ప్రగతిపథంలో నడిపిస్తున్న
నాయకుడు

శతాబ్దాల నిరీక్షణకు
శుభ ముగింపు పలికి
అయోధ్యలో భవ్య
రామమందిరాన్ని నిర్మించి
కోట్లాది హిందువుల కలలను
సాకారం చేశాడు
భారతీయ సంస్కృతికి
నూతన వైభవం తెచ్చి
డిజిటల్ ఇండియా
విప్లవాన్ని సృష్టించిన కార్యశీలి

చేతిలోనే సరికొత్త బ్యాంకింగ్
వ్యవస్థను అందించి పల్లె పల్లెకు
యూపీఐ సాంకేతికతను చేర్చి
ప్రపంచానికి సరికొత్త పాఠాలు
నేర్పిన మార్గదర్శకులు

స్వచ్ఛ భారత్ అంటూ
చీపురు చేతబట్టి
మేక్ ఇన్ ఇండియాతో
స్వయం స్వమృధ్ధిని సాధించి

పీఎం జన్ ధన్ యోజన
వన్ నేషన్ వన్ టాక్స్
ఆయుష్మాన్ భారత్
పీఎం గరీబ్ కల్యాణ్ యోజన
80 కోట్ల మందికి ఉచిత రేషన్
అందించి ఆకలి కేకలు లేని
భారత్ ఆవిర్భావానికి
కృషి చేస్తున్నాడు

ఉజ్వల యోజన ఆత్మనిర్భర
భారత్ తో యువతలో ఉపాధి
నైపుణ్యాభివృద్ధి పెద్ద పీటవేశాడు

ఉడాన్ పథకం వందే భారత్
రైళ్ల ప్రవేశం కరోనా కాలంలో
ఉచితంగా వ్యాక్సిన్ సప్లై చేసి
ప్రపంచమానవాళి కిఆరోగ్య
ప్రదాతగా నిలిచాడు

హై వేస్ రవాణా రంగం నిర్మాణం
ఆపరేషన్ సింధూర్ నిర్వహించి
భారత శక్తిని ప్రపంచానికి చాటాడు

కాశ్మీర్ లోయలో ఆర్టికల్
370నిరద్దు చేసి భారతావని
సమగ్రతను చాటిన
చారిత్రాత్మిక నేత మోదీ

ట్రిపుల్ తలాక్ సంకెళ్లను తెంచివేసి
నారి శక్తి చట్టంతో మహిళలకు
చట్టసభల్లో పీఠమిచ్చే మహిళా
రిజర్వేషన్స్ చట్టాన్ని ప్రవేశ
పెట్టాడు మహిళా సాధికారతకు
అడుగులు వేస్తూ ముందుకు
సాగుతున్న రాజనీతి
థురంథరులు మోదీ

సర్జికల్ స్ట్రైక్ తో శత్రువుల
గుండెల్లో వణుకు పుట్టించి
రాఫెల్ యుద్ధ విమానాలతో
గగన తలాన్ని రక్షించి
స్వదేశీ విక్రాంత్ నౌక సముద్ర
తీరాన గర్జించి దేశ భద్రతలో
ఎక్కడ రాజీ పడని ధీరుడు
మన ప్రధాని

సెప్టెంబర్ 12 _ 13 తేదీల్లో బ్రిక్స్
చరిత్రాత్మిక సదస్సు నిర్వహించి
ఉగ్రవాదం నిర్మూలన ఏకరూప
కరెన్సీ రూపకల్పన
మిడిల్ ఈస్ట్లో శాంతి స్థాపన
నిర్ణయంలో క్రియా శీలక పాత్ర
పోషించారు మోదీ

బ్రిక్స్ సదస్సుల్లో గ్లోబల్
సౌత్ నాయకుడిగా ఎదిగి
ఐక్యరాజ్య సమితి వేదికపై
భారత కీర్తిని చాటాడు

ప్రపంచ యోగా దినోత్సవంతో
దేశ సంస్కృతిని విశ్వ వ్యాప్తం
చేసివిశ్వ వేదికపై మన దేశాన్ని
అగ్రగామిగా నిలిపి దేశ సేవకై
తన జీవితాన్నే అంకితం చేసి
కోట్లాది ప్రజల గుండెల్లో కొలువై
నిలిచిన నేత నరేంద్ర మోదీ

దేశ పౌరులుగా మోదీ
నాయకత్వములో వికసిత
భారత్ 2047 స్వప్నాన్ని
సాకారం చేయడానికి
అభివృద్ధి యజ్ఞంలో
సంపూర్ణంగా పాల్గొందాం

వికసిత భారత్ లక్ష్యంగా
దూసుకుపోతున్న యుగ
పురుషుడు నవభారత
రూపశిల్పి మోడీ
కలలు గన్న భవ్య భారత్
సాకరమై‌భారత్ విశ్వగురువు
స్థాయికి ఎదగాలని ఆశిద్దాం

నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
తెలంగాణ వికాస వేదిక
రచయిత కాలమిస్ట్
కరీంనగర్ 9440245771

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.