నారాయణపేట, సెప్టెంబర్ 24( జన ఉదయం ప్రతినిధి )
మక్తల్ పట్టణంలో శుక్రవారం రోజు జరగనున్న వినాయక నిమజ్జనాల ప్రక్రియను వార్డు కౌన్సిలర్ అల్కూరి గురువారం పావని పరిశీలించారు. 16వ వార్డులో నిమజ్జనాలు సజావుగా సాగే విధంగా రోడ్లు కరెంటు ఇతర అవసరమైన అన్ని చర్యలను సజావుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహకరించాలని అధికారులను సూచించారు. అధికారులతో పాటు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్ మార్కెట్ డైరెక్టర్ శాలం కోఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్ ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.
