బొలెరో బైక్ ‘ఢీ’ ఇరువురు వాహనదారులు సేఫ్టీ

– తృటిలో తప్పిన పెను ప్రమాదం

నారాయణపేట, సెప్టెంబర్ 25 (జన ఉదయం ప్రతినిధి )

నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ముందు భాగంలో కల 167 వ జాతీయారాదారి టర్నింగ్లో ఖానాపూర్ వైపు నుండి వస్తున్న బొలోరో వాహనాన్ని బస్టాండ్ వైపు నుండి వస్తున్న టూ వీలర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు ఒకేసారి ఆగిపోయారు. తీరా చూసేసరికి ఎవరికి ఎలాంటి గాయాలు కానీ వాహన డ్యామేజ్ గాని జరగలేదు. ఆ సమయంలో ఇటు బస్టాండ్ నుండి వైపు కానివ్వండి రైచూర్ వైపు నుండి కానివ్వండి ఏదైనా పెద్ద వాహనము స్పీడ్ గా వచ్చి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇరువురికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో ఇరువురు ఊపిరి పీల్చుకొని వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.