Traffic Diversions: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంలో తిరుమల తిరుపతి ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ 28న జరగనుంది. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ ఘట్టాన్ని చూడటానికి తరలివస్తుండటంతో, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ మళ్లింపులు
- సెప్టెంబర్ 27 రాత్రి 9 గంటల నుండి సెప్టెంబర్ 29 ఉదయం 6 గంటల వరకు అలిపిరి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు ప్రవేశం లేదు.
- ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను అలిపిరి పాత చెక్పోస్ట్ వద్ద ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ ప్రదేశంలో నిలిపివేయాలి.
- భక్తులు పార్కింగ్ ప్రదేశాలను సులభంగా కనుగొనడానికి QR కోడ్ వ్యవస్థ అమల్లోకి తెచ్చారు.
పార్కింగ్ ఏర్పాట్లు
- రాంభగీచ పార్కింగ్: VVIP పెద్ద బ్యాడ్జ్ వాహనాలు
- సప్తగిరి గెస్ట్ హౌస్ పార్కింగ్: VIP చిన్న బ్యాడ్జ్ వాహనాలు
- సాధారణ వాహనాలు: ఔటర్ రింగ్ రోడ్ ద్వారా కేటాయించిన ప్రదేశాలు
- కడప, శ్రీకాళహస్తి వైపు వాహనాలు: ఇస్కాన్ గ్రౌండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, భారతీయ విద్యాభవన్ గ్రౌండ్
- టూరిస్టు వాహనాలు (చిత్తూరు, పీలేరు, ఇతర జిల్లాలు): దేవలోక్ ప్రాంగణం
- మదనపల్లి, చిత్తూరు వైపు వాహనాలు: భారతీయ విద్యాభవన్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఇస్కాన్ టెంపుల్ గ్రౌండ్
- పుత్తూరు వైపు వాహనాలు: మ్యాంగో మార్కెట్
- కరకంబాడి వైపు వాహనాలు: ఎస్.వి. ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద కట్-ఆఫ్ పార్కింగ్
- అలిపిరి బాలాజీ లింక్ బస్టాండ్: టూ వీలర్ పార్కింగ్
RTC & రవాణా సౌకర్యం
- తిరుపతి నుండి తిరుమల వరకు APSRTC, TTD ప్రత్యేక బస్సులు 24/7 అందుబాటులో ఉంటాయి.
- RTC బస్సులు నంది సర్కిల్, గరుడ సర్కిల్ మార్గం గుండా యథాప్రకారం తిరుమలకు వెళ్తాయి.
- చిత్తూరు, మదనపల్లి వైపు నుండి వచ్చే RTC బస్సులు కాలూరు క్రాస్, ఆర్.సీ.పురం, తనపల్లి – గరుడ ఫ్లై ఓవర్ గుండా మళ్లించబడతాయి.
భక్తులకు సూచనలు
- ప్రైవేట్ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే నిలపాలి.
- రోడ్ల పక్కన, అనధికారిక ప్రదేశాల్లో పార్కింగ్ నిషేధం.
- వీధి వ్యాపారులకు ప్రధాన రహదారులపై అనుమతి లేదు.
- అత్యవసర వాహనాలకు (అంబులెన్స్, పోలీస్, ఫైర్ సర్వీస్) ప్రాధాన్యత మార్గాలు ఖాళీగా ఉంచాలి.
- పోలీసులు, TTD సిబ్బంది, వాలంటీర్ల సూచనలు పాటించాలి.
భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు, అందరికీ సురక్షితమైన దర్శనం కల్పించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
