Crime News: అతను బలవంతంగా ముద్దు పెట్టబోయాడు.. ఆమె నాలుక కొరికి పాడేసింది!

Crime News

Crime News: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పెళ్లి అయిన 35 ఏళ్ల వ్యక్తి తన మాజీ ప్రియురాలిని బలవంతంగా ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆమెను వేధింపులకు గురి చేస్తుండగా.. ఆమె అడ్డగించింది. ముద్దుపెట్టుకునే ప్రయత్నంలో ఆమె తన ఆత్మరక్షణలో భాగంగా అతడి నాలుకను గట్టిగా కొరికేయడంతో కొంత భాగం తెగి పడింది. దీంతో అతడు నొప్పి, రక్తస్రావంతో విలవిలలాడిపోయాడు. వెంటనే అది గమనించిన స్థానికులు.. అతడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం అతడికి చికిత్స జరుగుతోంది. ఈ సమాచారం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. కాన్పూర్ జిల్లాలోని దరియాపూర్ గ్రామానికి చెందిన చంపీ అనే వ్యక్తి.. గతంలో ఒక యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతి తల్లిదండ్రులు.. ఆమెకు మరొకరితో వివాహం చేయించారు. దీంతో ఆమె చంపీకి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక వేదనకు గురైన చంపీ.. తరచూ ఆమెను కలిసేందుకు ప్రయత్నాలు చేసేవాడు.

Crime News: ఈ నేపథ్యంలోనే ఇటీవల సోమవారం మధ్యాహ్నం.. ఆ యువతి ఇంట్లో కట్టెల పొయ్యి కోసం బంకమట్టిని సేకరించడానికి దగ్గర్లో ఉన్న చెరువు వద్దకు వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటం గమనించిన చంపీ.. ఆమెను వెంబడించి చెరువు వద్దకు వెళ్లి.. ఆమెను పట్టుకుని వేధించడానికి ప్రయత్నాలు చేశాడు. ఆ యువతి చంపీని తీవ్రంగా ప్రతిఘటించింది. అతడ్ని వెనక్కి నెట్టివేసినప్పటికీ.. చంపీ బలవంతంగా ఆమెను ముద్దుపెట్టుకునేందుకు ప్రయత్నించాడు.

Crime News: దీంతో చంపీ నాలుకను ఆ యువతి గట్టిగా కొరకడంతో.. అతని నాలుకలో కొంత భాగం తెగిపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర రక్తస్రావం, నొప్పి కారణంగా చంపీ గట్టిగా అరవడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే దగ్గర్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తర్వాత.. చంపీ పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అతన్ని కాన్పూర్‌లోని హాలెట్ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ త్రిపాఠి పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *