Birthday Celebration: పుట్టినరోజు వేడుకలు భయానకంగా మారిన ఘటన!

Birthday Celebration: పుట్టినరోజు వేడుక పేరుతో యువకులు చేసిన పనిది ఏంటో అనే ప్రశ్న అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో ఒక విద్యార్థి తన స్నేహితులే చేసిన దాడి వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. బర్త్‌డే బమ్స్ పేరుతో సరదాగా ప్రారంభమైన వేడుక చివరకు ప్రాణాంతక దాడిగా మారడం స్థానికులను కలవరపరుస్తోంది.

Birthday Celebration: ముంబైలోని గురునానక్ ఖల్సా కళాశాలలో బీఏఎఫ్ చదువుతున్న అబుల్ ముఖ్యాం అనే యువకుడి పుట్టినరోజు నవంబర్ 24. ఈ సందర్భంగా అతని స్నేహితుడు అయాజ్ మాలిక్ రాత్రి ఎనిమిది గంటలకు కేక్ కటింగ్ కోసం రావాలని పిలిచాడు. తర్వాత మరో స్నేహితుడు షరీఫ్ ఫోన్ చేసి కోహినూర్ ఫేజ్ 3 సొసైటీ వింగ్ 26కి రావాలని చెప్పాడు. అబుల్ అక్కడికి చేరుకున్నప్పుడు అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, ఖాసిం చౌదరి, హజుపైనా ఖాన్, షరీఫ్ షేక్ కలిసి కేక్‌తో స్వాగతించారు.

Birthday Celebration: అబుల్ కేక్ కట్ చేయడానికి కత్తి తీసుకోగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అతని స్నేహితులు సరదా పేరిట అతనిపై రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇదే సమయంలో అయాజ్ పెట్రోల్ బాటిల్ తీసుకొని, అష్రఫ్ సహాయంతో అబుల్‌పై పోయడం మొదలెట్టాడు. పెట్రోల్ వాసన రావడంతో అబుల్ అయోమయానికి గురై “ఏం చేస్తున్నావ్?” అని అరవగా, అదే సమయంలో మిగతా ముగ్గురు స్నేహితులు అతన్ని గట్టిగా పట్టుకున్నారు.

తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న అబుల్‌పై అయాజ్ లైటర్‌తో నిప్పంటించడంతో అతని బట్టలు ఒక్కసారిగా మంటల్లో కూరుకుపోయాయి. ప్రాణాల కోసం పరుగెత్తిన అబుల్‌కు ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ వాటర్ బాటిల్ ఇచ్చి సహాయం చేశాడు. మంటలు పూర్తిగా ఆరకపోవడంతో అతను దగ్గర్లోని కుళాయి వరకు పరిగెత్తి నీరు వేసుకొని మంటల నుండి బయటపడ్డాడు.

తరువాత అతని స్నేహితుల్లో హుజైఫా వెంటనే అబుల్‌ను నగర ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు Aబుల్ ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, రెండు చేతులు, కుడి చేతిపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై అత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, ఈ దారుణానికి కారణమైన యువకులపై దర్యాప్తు ప్రారంభించారు.

స్నేహం పేరుతో ఇంతటి దారుణం జరిగిందంటూ ఈ ఘటనపై ముంబైలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *