బీఆర్ఎస్ అహంకార వైఖరికి నిరసనగా మక్తల్ తో దిష్టిబొమ్మల దగ్ధం..

• దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే తొలగించాలి..

• మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుల చావు డప్పు కార్యక్రమం..

నారాయణపేట, సెప్టెంబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)

బీఆర్ఎస్ పార్టీ ఆది నుంచి దళితులపై వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తూ వస్తోందని, దళితులకు పెద్దపీట వేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, తాజాగా జరిగిన ఘటన మరోసారి దీన్ని రుజువు చేస్తుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

దళిత స్పీకర్ పై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కనీసం ఆ పార్టీ నాయకులు వారి అధ్యక్షుడు ఖండించడం లేదని, ఇందుకు నిరసనగా ఆ నాయకుల దిష్టిబొమ్మలతో మక్తల్ అంబేద్కర్ చౌరస్తాలోని 167 వ జాతీయ రహదారిపై చావు డబ్బుల కార్యక్రమంతో అంతక్రియలు నిర్వహించారు. వెంటనే వారిని పదవుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… దళిత ముఖ్యమంత్రి హామీ ఇచ్చి హామీని తుంగలోకి తొక్కిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఏ .రవికుమార్ మున్సిపల్ సభ్యులు కర్రెమ్ మహేష్, రహీం పటేల్ ,సరిత గోవిందరావు, శ్రీవిద్యా నీల గౌడ్, మంజూరు ఇలాహి, నీలప్ప ముదిరాజ్ ,శంకర్ , మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వల్లంపల్లి లక్ష్మణ్ , శంషుద్దీన్, హుస్సాముద్దీన్, నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు సాయి ఫైనాన్స్ శ్రీనివాసులు, నారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్, సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మమ్మద్ ఫయాజ్ ,ఎన్ ఎస్ యు ఐ నియోజకవర్గం అధ్యక్షులు మొహమ్మద్ అఫ్రోజ్, బహదూర్ , అంజప్ప, ఫిరోజ్, . నాదర్ , నవీద్ పాషా, ప్రవీణ్ నరసింహ, కృష్ణ, డాక్టర్ నరసింహ తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.