– అభినందిస్తూ సన్మానించిన తాసిల్దార్ సతీష్ కుమార్, ఎస్సై రాజులు
– మెరిసిన పేదింటి అమ్మాయి మౌంటెన్ సైకిల్ పోటీల్లో సాధించిన కాంస్య పథకం
– అభినందిస్తూ హర్షం వ్యక్తం చేసిన కోచ్ గోపాలం
నారాయణపేట, సెప్టెంబర్ 8 (జన ఉదయం ప్రతినిధి)
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం, మద్వార్ గ్రామానికి చెందిన పేద వ్యవసాయదారుడు హ్యాండీక్యాప్డ్ వడ్ల వెంకటేశ్వర్లు మంజుల పెద్ద కూతురు వడ్ల తేజస్విని, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ,తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5,6 తేదీలలో హైదరాబాద్ మేడ్చల్ జిల్లా శామీర్ పేట అడవిలో గల వెదురు వనం లో జరిగిన 16 సంవత్సరాల లోపు సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి 5 కి.మీ మౌంటెన్ సైకిలింగ్ పోటీలలో పాల్గొని, క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి కాంస్య పతకం సాధించి జాతీయస్థాయి మౌంటెన్ సైకిల్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు. జాతీయస్థాయి సైకిల్ పోటీలకు ఎంపికైన వడ్ల తేజస్విని అక్టోబర్ 1 నుండి 4 వరకు ఒడిశా రాష్ట్రం మహేంద్రగిరిలో జరుగు జాతీయస్తాయి సైకిల్ పోటీలలో పాల్గొంటుందని బి. గోపాలం తెలిపారు. తేజస్విని ప్రస్తుతము మక్తల్ ఎల్లమ్మ కుంట లో గల నర్వ బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది.రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించి జాతీయస్థాయి సైకిల్ పోటీలకు ఎంపికైన వి. తేజస్విని , కోచ్ బి. గోపాలమును మక్తల్ తాసిల్దార్ సతీష్ ,ఎస్సై పి. రాజు ఘనంగా సన్మానించి అభినందించి, చదువుతోపాటు క్రీడల రాలిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బి.గోపాలం, ఉపాధ్యక్షుడు జి .శివకుమార్, తండ్రి వెంకటేశ్వర్లు ,వి శివశంకర్, రాము పాల్గొన్నారు.
