మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్ల ఆవిష్కరణ

  1. – మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఎస్పీ వినీత్ తో కలీసి ఆవిష్కరించిన కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, సెప్టెంబర్ 9 (జన ఉదయం ప్రతినిధి)

వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుచున్నాయని, అందుచే కృత్రిమ రంగులు, రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని
జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు.

బుధవారం జిల్లా కలెక్టర్ విసీ హాల్ లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు, మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఎస్పీ వినీత్ తో కలీసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణంపై అహగహన కార్యక్రమాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారిచే నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

చెరువుల్లో మట్టి మేటలను తొలిగించటానికి చెరువులో స్వచ్చత కాపాడటానికి వినాయక చవితి సందర్భంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.
మట్టి విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్మన్ మంజుల, ఈ.డి.ఎస్.సి.కార్పొరేషన్ అబ్దుల్ ఖలీల్,డీఎస్పీలు తదితరులు నల్లపు లింగయ్య , మహేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.