ప్రజాకవి కాళోజీ నారాయణరావు

• జిల్లా కలెక్టర్ ప్రియాంక

• ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన కలెక్టర్

నారాయణపేట, సెప్టెంబర్ 9 (జన ఉదయం ప్రతినిధి)

ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని, ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు.
కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు, సామాజిక అంశాలను తన రచనల ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చి వారిలో చైతన్య స్ఫూర్తిని నింపిన మహనీయుడు కాళోజీ అని అన్నారు. తెలంగాణ భాష, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కాళోజీ సాహిత్యం ప్రజల్లో చైతన్యం నింపిందని, ఆయన రచనలు, ఆలోచనా విధానాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కాళోజీ ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్, వైస్ చైర్ పర్సన్ మంజుల, డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, కలెక్టరేట్ ఏ వో అనిల్ కుమార్, డీ పీ ఆర్ వో రషీద్, మున్సిపల్ కమిషనర్ శంకర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.