– అధ్యక్షులు లైన్ టి.నాగరాజు
నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి)
లయన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ బీమా
సభ్యుల సహకారంతో సోమవారం అధ్యక్షుడు లయన్ టి నాగరాజు అధ్యక్షతన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో అనే అంశంపై అవగాహన కల్పిస్తూ మట్టి వినాయక ప్రతిమలను పూజించండి కాలుష్య రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎస్ రమేష్ రావు ,కోశాధికారి బి .అంబాదాసు రావు, డిస్టిక్ క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ డాక్టర్ శ్రీరామ్ లయన్ సభ్యులు, అనుగొండ శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, కొండా విజయ్ కుమార్, ఆడం శ్రీనివాస్ , కర్నే స్వామి, డాక్టర్ మణికంఠ గౌడ్, అంజిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి,అంజన్ ప్రసాద్ పాల్గొన్నారు.
