– అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లక్ష్మీ గాయత్రిని పరామర్శించిన మంత్రి
నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ పట్టణానికి చెందిన గాయత్రి అనిల్ కుమార్ తల్లి లక్ష్మీ గాయత్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మహబూబ్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆసుపత్రికి వెళ్లి లక్ష్మీ గాయత్రిని పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అందిస్తున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని మంత్రి ఆకాంక్షించారు.
లక్ష్మీ గాయత్రి కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వెంట స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుచరులు తదితరులు ఉన్నారు.
