మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణి

– వాసవి క్లబ్ అధ్యక్షులు హరికృష్ణ

నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి)

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణం లో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్బంగా సోమవారం మక్తల్ పట్టణం లో గల స్థానిక పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షులు హరికృష్ణ సమక్షంలో మట్టి వినాయకులు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ విజ్ఞులు తొలగించే విఘ్నేశ్వరునికి పూజ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని, వినాయక చవితి నాడు పండ్లు, పూలు, ఫలహారం పెట్టి పూజ చేయడం వలన అందరు ఆరోగ్యం గా, ఆహ్లాదంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మాజీ డిప్యుటీ గవర్నర్ కల్వ శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ, దొంత లక్ష్మణ్, అశోక్ గురు స్వామి, కల్వల్ నర్సింహా, కల్వల్ రవి కుమార్, రాకేష్, మామిళ్ళ పృథ్వీ, యల్ల లింగ,శివరాం, శివరాం గురు స్వామి,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.