• నాన్నగారి అడుగుజాడల్లో అడుగు వేస్తూ 16వ వార్డు అభివృద్ధికి ఎనలేని కృషి
• ఆమెనే 16వ వార్డు కౌన్సిలర్ ఆల్కూరి పావని
• 16వ వార్డులో వాటర్ పైప్ లైన్ లీకేజీలకు మరమ్మతులు..
నారాయణపేట, సెప్టెంబర్ 26 (జన ఉదయం ప్రతినిధి)
వయసు చిన్న అభివృద్ధి పనులు చేయుటలో మిన్న. నాన్నగారి అడుగుజాడల్లో అడుగు వేస్తూ 16వ వార్డు అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు ఆమెనే మన మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ ఆల్కూరి పావని. వార్డులో ఎలాంటి పనులు చేయాలన్నా ఏ చిన్న పైపులు లీకేజీ అవుతున్న మక్తల్ పట్టణంలో ఏ వార్డులో జరగని అభివృద్ధి ఇంట్రెస్ట్ అన్ని విధాలుగా తీసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు మన ఆల్కూరి పావని.
శనివారం 16వ వార్డులో వాటర్ పైప్ లైన్ లీకేజీలకు అనుకున్నదే తడువుగా వెంటనే మరమ్మతులను,పలుచోట పైప్ లైన్ లీకేజీలకు చేపట్టినట్లు అలుకురి పావని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజయ్య, ఏఈ నాగశివలకు 16వ వార్డులో వాటర్ పైప్ లైన్ ల లీకేజీలు ఉన్నట్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే… సిబ్బందిని పంపించి వాటర్ పైప్ లైన్ మరమ్మతులు చేపట్టినట్లు పావని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే 16వ వార్డులో మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో దాదాపు 6 లక్షల లీటర్ల కెపాసిటీతో మున్సిపాలిటీలోనే అతిపెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామని, దీంతోపాటు వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు జోరుగా సాగుతున్నాయని, ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కురి రవికుమార్ కో ఆప్షన్ నెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్ మార్కెట్ డైరెక్టర్ శాలెం మున్సిపల్ సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
