నేరేడగంలో కళ్యాణమంటపానికి భూమి పూజ గావించిన ఎంపీ డీకే అరుణ

– ఎంపీ డీకే అరుణ ను అభినందిస్తూ ఆశీర్వదించి ఘన సన్మానం భావించిన పంచమసిద్ధ లింగం మహా స్వాములవారు

నారాయణపేట, సెప్టెంబర్ 9 (జన ఉదయం ప్రతినిధి )

నారాయణపేట జిల్లా మాగనూర్ మండలం నేరెడగం గ్రామంలోని శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి మఠంలో ఎంపీ నిధులతో కళ్యాణమంటపాన్ని నిర్మించుటకై బుధవారం మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ స్వామివారు ఎంపీ డీకే అరుణని శాలువాతో ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు.
అనంతరం ఆలయ ఆవరణలో తన నిధులతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి ఎంపీ డీకే అరుణ గారు భూమి పూజ చేసి శంకుస్థాపన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ….

కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు . శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలగడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. ఈ ప్రాంత అభివృద్ధికి నా శక్తిమేరకు నిరంతరం కృషి చేస్తాను అన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, శ్రీ మఠం భక్తులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.