జాతీయస్థాయి సైకిల్ పోటీలకు ఎంపికైన జి. త్రివేణి

• జి. త్రివేణి పీఈటిని, కోచ్ బి.గోపాలమును అభినందిస్తూ సన్మానించిన ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది

• మారుమూల ప్రాంతం నుండి జాతీయ స్థాయికి ఎరిగిన త్రివేణి అభినందించిన నర్వ మండల విద్యావేత్తలు

• త్రివేణి అభినందించిన నర్వ కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు

నారాయణపేట, సెప్టెంబర్ 9 జన ఉదయం ప్రతినిధి

నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి టీచర్ మల్లేష్ భార్య జి. త్రివేణి నర్వ కేజీబీవీ పాఠశాలలో పిఈటిగా పనిచేస్తున్న జి. త్రివేణి నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం ఆధ్వర్యంలో ,తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5,6 తేదీలలో హైదరాబాద్ మేడ్చల్ జిల్లా శామీర్ పేట అడవిలో గల వెదురు వనం లో జరిగిన ఎలైట్ మహిళ సీనియర్ రాష్ట్రస్థాయి 5 కి.మీ మౌంటెన్ సైకిలింగ్ పోటీలలో పాల్గొని, క్రీడా నైపుణ్యతను ప్రదర్శించి కాంస్య పతకం సాధించి జాతీయస్థాయి మౌంటెన్ సైకిల్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు. జాతీయస్థాయి సైకిల్ పోటీలకు ఎంపికైన జి. త్రివేణి అక్టోబర్ 1 నుండి 4 వరకు ఒడిశా రాష్ట్రం మహేంద్రగిరిలో జరుగు జాతీయస్తాయి సైకిల్ పోటీలలో పాల్గొంటుందని బి. గోపాలం తెలిపారు. ఈ నెల 9న నర్వ మండలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జి. త్రివేణి పీఈటిని, కోచ్ బి.గోపాలమును,స్పెషల్ ఆఫీసర్ గోపాల చారి, ఎంపీడీవో టి. శ్రీనివాసులు, ఎంపీ ఓ రాఘవేందర్, ఎంఈఓ రామ్ రెడ్డి ,నర్వ సర్పంచ్ హనుమంతు రెడ్డి, ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ జాతీయస్థాయి సైకిల్ క్రీడలకు ఎంపికైన పిఈటి త్రివేణి మన నర్వ మండలానికి కీర్తి ప్రతిష్టలు పెంచిందని ఆయన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో టీచర్ మల్లేష్, మధుబాబు,వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.