ఈ నెల 11న మక్తల్ మల్లికార్జున స్వామి దేవాలయంలో “లక్ష బిల్వార్చన”

– శ్రీశ్రీశ్రీ ఋషిముని తిప్పయ్య స్వామిజీ , శివశరణి మహాసాధ్వి నీలమ్మ మాతజీలు

నారాయణపేట, సెప్టెంబర్ 10 (జన ఉదయం ప్రతినిధి)

 

శ్రీశ్రీశ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయము
ద్వాదశ జ్యోతిర్లింగ మహా దేవాలయం, వినాయక నగర్, మక్తల్ నందు
శ్రావణమాస ముగింపు సందర్భంగా
లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ఈ నెల 11వ తేదీ శుక్రవారం శ్రీశ్రీశ్రీ రుషి ముని తిప్పయ్య స్వామిజి శివశరణి మహాసాధ్వి నీలమ్మ మాత
పుణ్య జంగమ దంపతుల ఆధ్వర్యంలో..
శ్రీ దేవాలయ కమిటీ, వీరశైవ-లింగాయత్ కమిటీ, మక్తల్ పట్టణ శివ దీక్షాస్వాముల, సమస్త గ్రామ పెద్దలు, భక్తుల సారధ్యంలో అంగరంగ వైభవ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా తిప్పయ్య స్వామీజీ మాట్లాడుతూ
ఈనెల 11 వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున గం॥ 4-30లకు సంకల్పంతో రుద్రాభిషేకము ఉ॥ 6-45 నిమిషాలకు మంగళహారతి జరుగును. ఉ॥గం 9-05 నిమి నుండి శ్రీ వరద శంకర వ్రతం అనంతరం లక్షబిల్వార్చన, ప్రవచనం, మ॥ 12-15 నిమిషాలకు శ్రావణ మాసము ముగింపు మహా మంగళ హారతి, అన్నప్రసాద వితరణ జరుగును.
ఈ పవిత్రమైన శ్రావణ మాసం ముగింపు పూజా కార్యక్రమాలకు భక్తాదులందరూ తమ సకల సపరివార సమేతంగా విచ్చేసి, శ్రీ స్వామి వారి ఆశీర్వాదాలు స్వీకరించి, అన్న ప్రసాదం స్వీకరించి గురు కృపకు పాత్రులు కాగలరని అశోక్ తెలిపారు. ఇట్టి కార్యక్రమ ఆహ్వానిత దాతలు కె వెంకటేశ్వరమ్మ- గోపాల్ శెట్టి, మక్కల వారు శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం
వినాయక నగర్, మల్లల్ శాఖ వారితోపాటు
స్వామివారి సేవలో శ్రీ పడమటి ఆంజనేయస్వామి బైక్ మెకానిక్ పాయింట్
సుల్తాన్‌నగర్, గుడి ఎదుటగా, హైదరాబాద్ రోడ్ వారు స్వామివారి సేవలో పాలు పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.