Free Travel: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్.. ఇక నుండి ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం!

Free Travel: ఆంధ్రప్రదేశ్ మహిళలకు శుభవార్త. ఇప్పటివరకు సాధారణ సర్వీసుల్లో మాత్రమే అమలవుతున్న ‘స్త్రీశక్తి పథకం’ ఇకపై ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ వర్తించబోతోంది. రాష్ట్ర రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Free Travel: తాడిపత్రి ఆర్టీసీ డిపోను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల మధ్య నడిచే కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులను సేవలోకి తీసుకురాబోతున్నామని, వీటిలో 300 బస్సులను తిరుపతికి, మిగిలిన 700 బస్సులను రాష్ట్రంలోని 13 ప్రాంతాలకు కేటాయించనున్నట్లు వివరించారు.

ఇది కూడా చదవండి: Baby Dies: పాలు ఆరోగ్యానికి మంచిది కానీ అవే పాలు పసిబిడ్డ ప్రాణం తీసింది!

స్త్రీశక్తి పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ద్వారకా తిరుమలరావు తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సీట్లు వంటి సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

తాడిపత్రి బస్టాండు తనిఖీ సమయంలో పైకప్పు సమస్యలు గమనించిన ఆయన.. వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. అలాగే కడప గ్యారేజీ, బస్టాండును ఆకస్మికంగా పరిశీలించి సిబ్బందితో సమస్యలు తెలుసుకున్నారు. కడప బస్టాండు ప్రాంగణంలో రూ.1.30 కోట్ల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.

వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యలను అధిగమించడానికి కొత్త వసతులు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉచిత ప్రయాణాన్ని వినియోగించే మహిళలు ఎంతో క్రమశిక్షణతో ఉంటున్నారని అభినందించారు. ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, మెరుగైన మౌలిక వసతులతో రాష్ట్ర రవాణా సేవలను మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *