IPL 2026: విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీ విజయం..చరిత్రలో కొత్త రికార్డులు

IPL 2026: ఐపీఎల్ 34వ మ్యాచ్‌లో ఆర్సీబీ – గుజరాత్ టైటాన్స్ పై 5 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో విరాట్ కోహ్లి రికార్డ్ ఇన్నింగ్స్ ఉంది .  కోహ్లీ కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టును విజయానికి నడిపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతను ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు, 300 సిక్సర్లు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతని మొత్తం పరుగులు 8989గా ఉండగా, 9000 పరుగుల మైలురాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు.

  • ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో రోహిత్ శర్మ 7183 పరుగులతో ఉన్నాడు. కోహ్లీ ప్రదర్శన ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి కీలకంగా మారింది.
  • ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఎనిమిది ఫోర్లు కొట్టడంతో అతని మొత్తం ఫోర్ల సంఖ్య 800 దాటింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అతను 807 ఫోర్లు నమోదు చేశాడు. ఈ జాబితాలో శిఖర్ ధావన్ (768) డేవిడ్ వార్నర్  (663) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • అదేవిధంగా, ఈ మ్యాచ్‌లో నాలుగు సిక్సర్లు బాదిన కోహ్లీ, 300 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్  (357) పేరిట ఉండగా, రోహిత్ శర్మ 310 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
  • మరోవైపు, గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. అతను కేవలం 47 ఇన్నింగ్స్‌లలోనే 2000 పరుగులు పూర్తి చేసి, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది.
  • సుదర్శన్ ఇన్నింగ్స్‌లో ఒక ప్రత్యేక క్షణం కూడా కనిపించింది. కృనాల్ పాండ్య వేసిన బౌన్సర్‌ను అతను ఒంటిచేత్తో సిక్సర్‌గా మార్చడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
  • సుదర్శన్ – శుభ్ మన్ గిల్ తో కలిసి తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఐపీఎల్‌లో ఇది వారి ఎనిమిదో శతక భాగస్వామ్యం. ఈ జాబితాలో కోహ్లీ–ఏబీ డివిలియర్స్ జోడీ 10 భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉంది.
  • ఇక ఆర్‌సీబీకి ఇది చిన్నస్వామి స్టేడియంలో 50వ విజయం కావడం విశేషం. ఒకే వేదికపై అత్యధిక విజయాలు సాధించిన జట్లలో ముంబై, కోల్‌కతా, చెన్నై తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *