AP Toursim: ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త ఏర్పాట్లు.. పర్యాటకులకు అదిరిపోయే ఎక్స్ పీరియన్స్

AP Tourism

AP Toursim: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి వినూత్న ప్రణాళికలు రూపొందిస్తోంది. తాజాగా, హోంస్టేలు, కారవాన్ టూరిజంలాంటి విధానాలతో రాష్ట్రం పర్యాటక రంగానికి సరికొత్త ఇమేజి తీసుకువచ్చి . . పర్యాటకులను ఆకర్షించడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తోంది.

అల్లూరి జిల్లాలో కారవాన్ ట్రయల్ రన్

AP Toursim: అల్లూరి సీతారామరాజు జిల్లాలో హోంస్టేలు, కారవాన్ టూరిజం పెంపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా  ట్రయల్ రన్ పేరుతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ కారవాన్ వాహనం ఆదివారం లంబసింగి చేరుకుంది. మూడు కుటుంబాలకు అనుకూలంగా అన్ని అవసరమైన సదుపాయాలతో కారవాన్‌ను రూపొందించారు.

అధికారుల సమీక్ష, ప్రోత్సాహం

హరిత రిసార్టు అధికారులు కారవాన్ రనింగ్ ను పరిశీలించారు. అలాగే కారవాన్ నిర్వహకులకు అల్లూరి జిల్లాలో సిద్ధంగా ఉన్న పర్యాటక ప్రాంతాలు, వనరులు, అవకాశాలను వివరించారు. ఈ ట్రయల్ విజయవంతంగా జరిగితే  లంబసింగి, తాజంగిలో ఇలాంటి కారవాన్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.

AP Toursim: కారవాన్ టూరిజానికి వచ్చే అవకాశం

  • హోంస్టేలు, కారవాన్లు కొత్త ప్రయోగంగా

  • లంబసింగి, తాజంగిలో అమలు చేయాలనే యోచన

  • అక్కడ సక్సెస్ అయితే మిగిలిన టూరిజం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన .

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగానికి ఇవి కొత్త బలం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోంస్టేలు, కారవాన్ టూరిజం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది .  అధికారులు, నిర్వాహకులు కలిసి ఈ వినూత్న పద్ధతులను విజయవంతంగా అమలు చేయడానికి కృషి  చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *