“ఆలోచనే ఆధారం”

• నేదునూరి కనకయ్య

(నేడు సానుకూల ఆలోచనా దినోత్సవం)

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (జన ఉదయం ప్రతినిధి)

ఆలోచన మనిషికి ఉన్న
గొప్ప వరం ఆలోచనతోనే
మంచి చెడు మధ్య వివక్ష
పాటిస్తాడు ప్రగతికి
ప్రణాళికలు రచిస్తాడు
ఓ మనిషి నీ ఆలోచనలను
మార్చుకో నీ ప్రపంచం
దానంతటదే మారుతుంది

ప్రతి చీకటి రాత్రి వెనుక
ఒక అందమైన ఉదయం
దాగి ఉన్నట్లే ప్రతి కష్టం
వెనుక ఒక గొప్ప
అవకాశం ఉంటుంది

ప్రపంచం నిన్ను నమ్మకపోయినా
పర్వాలేదు కానీ నిన్ను నువ్వు
నమ్మడం ఎప్పటికీ ఆపవద్దు.

సమస్యలు నిన్ను కుంగ
తీయడానికి రావు
నీలో దాగి ఉన్న శక్తిని
సామర్థ్యాన్ని పరిచయం
చేయడానికి వస్తాయి

మదిలో చీకటి మురిసిన వేళ
ఆశల దీపం వెలిగించి చూడాలి
ఓటమి నిన్ను వెక్కిరించిన వేళ
గెలుపుకు సరికొత్త బాటలు
వేయాలి

నిరాశల అలలు నిన్ను ముంచినా
ధైర్యపు నావుపై ప్రయాణించాలి
ప్రతికూల ఆలోచనల ముళ్ళను
తుంచేసి సానుకూల సుగందాలు
వ్యాపింప చేయాలి

ఆలోచన మారితే ఆశయం మారును
ఆశయం మారుతే నీ భవిష్యత్తు
మారను నమ్మకమే నీ మొదటి
అడుగు కావాలి అప్పుడు
విజయం నీకు బానిస అవుతుంది

ఎగిరే పక్షిని చూసి నేర్చుకో
పడినా మళ్ళీ పైకి లేవడం
సానుకూల దృక్పదమే
నీఆయుధమైతే
జగత్తును జయించడం
ఎంతో సులభం
నెగెటివ్ ఆలోచనలు వద్దు
సానుకూల ఆలోచనలే
మన విజయాలకు హద్దు

మీ….
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్ 9440245771

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.