– లంకాల బిజెపి పార్టీ ఒకటవ వార్డు మెంబర్ కురువ శారదా మల్లేష్ కాంగ్రెస్ లో చేరిక
– కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుతూ స్వాగతించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
నారాయణపేట, సెప్టెంబర్ 14 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం-లంకాల గ్రామంలో బీజేపీ పార్టీ 1వ వార్డు మెంబర్ కుర్వ శారదా మల్లెష్ సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన శారదా మల్లేష్ కి కాంగ్రెస్ కుటుంబంలోకి హృదయపూర్వక స్వాగతం. పలికిన, నర్వ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, లంకాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి…
కాంగ్రెస్‌తోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని లంకాల ఒకటవ వార్డు నెంబర్ కురువ శారద మల్లేష్ అన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు వాకిలి శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన చేస్తున్న పని విధానానికి ముగ్ధులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని ఆమె తెలిపారు.
