స్వామి వివేకానంద విగ్రహా అవిష్కరణలో మహోత్సవ వారోత్సవాలో భాగంగా తిరంగా ర్యాలీ

• ఘనంగా మక్తల్ పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా కార్యక్రమం

• వేలాది మంది విద్యార్థులతో పురవీధుల గుండా భారీ ర్యాలీ

నారాయణపేట, సెప్టెంబర్ 17 (జన ఉదయం ప్రతినిధి )

మఖ్తల్ పట్టణంలో స్వామి వివేకానంద చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ సందర్భంలో భాగంగా స్వామి వివేకానంద విగ్రహ వ్యవస్థాపక కమిటీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో

నిర్వహిస్తున్న వారోత్సవాలలో నాలుగవ రోజు అయిన గురువారం మఖ్తల్ పట్టణంలోని స్వామి వివేకానంద చౌరస్తా లో జాతీయ పతాకావిష్కరణ గావించి వేలాదిమంది విద్యార్థులతో ఘనంగా తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఇట్టి ర్యాలీ చూసిన పట్టణ ప్రజలు ముగ్దలాయ్యారు అయ్యారు.
ఈ యొక్క కార్యక్రమంలో అన్ని పాఠశాల,కళాశాలల విద్యార్థులు ఏబీవీపీ నాయకులు వివేకానంద విగ్రహ వ్యవస్థాపక కమిటీ సభ్యులు వివిధ క్షేత్రాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.