– ప్రైవేటు పనులపై చూపుతున్న ఇంట్రెస్ట్ మున్సిపాలిటీ పనులపై ఎందుకు చూపలేకçపోతున్నారంటు ప్రజల తీవ్ర ఆరోపణ
– ట్రాక్టర్ వెళ్లి డ్రైనేజీ పైప్లైన్ పగలగొట్టిన మాకు సంబంధం లేదు అంటున్న మున్సిపాలిటీ ప్లంబర్
– ప్రైవేటు నల్ల కలెక్షన్లు ఇవ్వాలంటే అడిగి అడిగి వేల రూపాయలు దండుకుంటూ పనులు చేస్తున్నారు
– ఇంత జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ మాత్రం నిమ్మకు నిరత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు
– అమ్మ కలెక్టర్ అమ్మ మక్తల్ మున్సిపాలిటీ వాటర్ మాన్ ప్లంబర్ల పనితీరును జర చూడమ్మా
– ఒకటవ వార్డు వీధి ప్రజల తీవ్ర ఆవేదన
నారాయణపేట, సెప్టెంబర్ 23 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ పట్టణంలోని ఒకటవ వార్డులో ఇండ్ల నుండి వెళుతున్న డ్రైనేజ్ పైప్ లైన్లు ఓ క్రేను, ట్రాక్టర్ లోడ్ తో వచ్చి పైప్ లైన్ గుంతలో పడిపోవడంతో లీకేజీ కావడం జరిగింది. ఇట్టి లీకేజీ జరిగి దాదాపు పది పదిహేను రోజులు కావస్తున్న అట్టి పైప్ లైన్ రిపేరు చేయవలసిన మక్తల్ మున్సిపాలిటీ ప్లంబర్లు చూసి అది మా పని కాదు అది ప్రైవేట్ పని మాకు సంబంధం లేదు అంటూ తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ప్లంబరు వెళ్లిపోవడము ఎంతవరకు సమంజసం అంటూ వీధి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సంబంధిత వార్డు మెంబరు చెప్పిన కూడా పట్టించుకోకుండా వెళ్లిపోవడంతోటి
తన వార్డు ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఒకటవ వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందిస్తూ ప్రైవేటు వ్యక్తులను పెట్టి గుంతను తవ్వించి వాటికి మరమ్మతులు చేయించారు.
వాటర్ పైప్లైన్ ప్లంబర్లకు ఎందుకు ఇంత దుర్సుతనం….
వాటర్ పైప్లైన్ ప్లంబర్లు ఎవరికి వారు తమ ప్రైవేటు వ్యక్తులతో మున్సిపాలిటీ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేకుండా తమ సొంత నిర్ణయాలతో వాటర్ కనెక్షన్ ఇవ్వడం మున్సిపాలిటీ కార్యాలయం ఆదాయానికి గండి కొట్టడం ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. వీరి విషయంలో మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత చైర్మన్ ఎవరూ పట్టించుకోలేకపోతున్నారు. కారణం వీరికి భయపడుతున్నారా లేక ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజలు అంటున్నారు.
మెయిన్ రోడ్డు పై ఏదో ఒక వాహనం వెళ్ళినప్పుడు డ్రైనేజీ పైపులు పగిలిన లేక ఇతరత్రా డ్రైనేజీ కట్టిన రాళ్లు పడినప్పటికీ నీళ్లు పోకుండా నిలువ ఉంటే వాటికి మరమ్మతులు చేపట్టవలసింది ఎవరు? మున్సిపాలిటీ వర్కర్ల లేక ఎవరో ముక్కు ముఖం తెలియని వారు వాహనం తో ఇబ్బంది కలిగించిన వారా ఈ విషయం సంబంధిత కమిషనర్ మున్సిపాలిటీ అధికారులు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ప్రజలు అంటున్నారు.
తమ సొంతంగా మున్సిపల్ కార్యాలయ సమయములోని ప్రైవేటు వర్కులు పట్టుకోవడం వారితో డబ్బులు దండుకొని అట్టి పనులు చేయించడం ఎన్నో చూశారు ప్రజలు. అదే ముంచిపాటికి సంబంధించిన ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని చేయమంటే మాకు సంబంధం లేదు . అవార్డు నాది కాదు అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఏమిటి ఎందుకు ఇంత వీరులోన దురుసుతనం. అన్నం పెట్టే కార్యాలయంలో పనిచేస్తున్న వీరు ఆ అన్నానే కాదనుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారా ఇట్టి విషయంలో అధికారులు తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.
అమ్మ కలెక్టర్ అమ్మ మక్తల్ మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్ ప్లంబర్ల పనితీరు జర చూడమ్మా…..
- మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న వాటర్ పైప్ లైన్ ప్లంబర్లు ఎవరి మాట వినరు ఈ సీతయ్య అన్న విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం. ఏ పని చేసిన మేన మీద మెరుగులు దిద్దే పనులు తప్ప పూర్తిస్థాయి పర్మినెంట్ పని చేత మన ఆలోచన మాత్రం వీరికి ఉండటం లేదు . వీరి కారణంగా మక్తల్ పట్టణంలోని వీధి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలుసు ఆయన ఏ ఒక్కరు చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మక్తల్ మున్సిపాలిటీలో అటు వాటర్ పైప్ లైన్ ప్లంబర్లు కానివ్వండి విద్యుత్తు సంబంధించిన వారు కానివ్వండి కామాటీలు కానివ్వండి ఒక వీధిలో వారానికొకసారి వచ్చేనా శుభ్రం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజలు కోరుతున్నారు.
లేనిపక్షంలో ఏదో ఒక రోజు ఆయా అవార్డుల్లో ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు అన్న విషయాన్ని సంబంధిత మున్సిపాలిటీ పాలకవర్గం అధికారులు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ప్రజలు బహిరంగంగా అంటున్నారు.
