అక్రమంగా మద్యం నిల్వపై టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసుల దాడులు

• నాలుగు కేసుల్లో మొత్తం 59.5 లీటర్ల మద్యం, సుమారు రూ.29,540/- విలువైన మద్యం స్వాధీనం

• మక్తల్ ఎస్సై  రాజు 

• నారాయణపేట, సెప్టెంబర్ 23 (జన ఉదయం ప్రతినిధి )

మక్తల్ మండల పరిధిలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసులు దాడులు నిర్వహించి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.

మక్తల్ మండలం చందాపూర్ గ్రామంలోని కిరాణా దుకాణాల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసిన వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ వద్ద నుంచి 13.5 లీటర్ల మద్యం, విలువ రూ.9,000/-, పి. వెంకటేష్ వద్ద నుంచి 17.5 లీటర్ల మద్యం, విలువ రూ.10,600/- స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా సంగంబండ రోడ్డులో కాలువ సమీపంలోని ధాబాల వద్ద అక్రమంగా మద్యం నిల్వ చేసిన వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మక్తల్ పట్టణానికి చెందిన మోహన్ నాయక్ వద్ద నుంచి 21 లీటర్ల మద్యం, విలువ రూ.7,900/-, కొత్తగార్లపల్లి గ్రామానికి చెందిన ఓ. లక్ష్మణ్ వద్ద నుంచి 7.5 లీటర్ల మద్యం, విలువ రూ.2,040/- స్వాధీనం చేసుకున్నారు.
ఈ నాలుగు కేసుల్లో మొత్తం 59.5 లీటర్ల మద్యం, సుమారు రూ.29,540/- విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు మక్తల్ ఎస్‌ఐ రాజు తెలిపారు.
అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయించే వారిపై నిరంతరం నిఘా ఉంచి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మక్తల్ ఎస్ఐ రాజు హెచ్చరించారు.

PRO, SP Office.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.