– పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్
పి నరసింహ గౌడ్
– మంటపములో ప్రత్యేక పూజలు గావించిన నరసింహ గౌడ్
– భక్తులకు అన్నదాన వితరణ
నారాయణపేట, సెప్టెంబర్ 24 (జన ఉదయం ప్రతినిధి)
మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపురం గ్రామంలో గురువారం ఆ గ్రామంలో ప్రతిష్టాపన చేసిన విగ్నేశ్వర మండపాల దగ్గర మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనను నిర్వాహకులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదను అందజేశారు.
నరసింహ గౌడ్ మాట్లాడుతూ….
ఆది దేవుడిగా కొలువబడుతున్న ఆ గణనాథుని పూజించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. గణనాథుడు అన్ని వర్గాల ప్రజలను చల్లగా చూడాలని స్వామివారి దీవెనలు అందరి పై ఉండి అందరి అభివృద్ధికి తోడ్పడాలని ప్రత్యేకంగా ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు. వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి రైతుల కష్టాలు తీర్చాలని అందుకు ఆ దేవదేవుడు గణనాథుడు ప్రజలను, రైతులను ఆశీర్వదించి, అందరించి ఆదుకోవాలని ఆ గణనాథుని ఆయన కోరారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్న ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు…
బిఆర్ఎస్ పార్టీ నాయకుడు చందాపురం అశోక్ కుమార్ గౌడ్, నిర్వాకులు బద్రి రాము,అంజి, నరసింహ, శంకర్, కళ్యాణి, రాజు,రవి,రామన్ గౌడు,వెంకటేష్ గౌడ్, శ్యాంసుందర్ గౌడ్, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
