నారాయణపేట, సెప్టెంబర్ 24 (జన ఉదయం ప్రతినిధి )
మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తున్న వారి అప్లికేషన్లను అధికారులు పరిశీలించినట్లు వాడు కౌన్సిలర్ అల్కోరి పావని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు పింఛన్లు అందే విధంగా చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు అధికారులతో పాటు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్ మార్కెట్ డైరెక్టర్ శాలం కోఆప్షన్ మెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్ ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.
