16వ వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని వార్డులో మరో అభివృద్ధి పని

– ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు నూతన మూత్రశాలల మంజూరు..

– త్వరలో మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా భూమి పూజ

నారాయణపేట, సెప్టెంబర్ 28 (జన ఉదయం ప్రతినిధి)

మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలో వార్డ్ కౌన్సిలర్ ఆల్కూరి పావని వార్డులో మరో అభివృద్ధి చోటు చేసుకుంది.
వార్డు పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా మూత్రశాలలను నిర్మించేందుకు అనుమతులు లభించాయని, త్వరలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మూత్రశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారని వార్డు కౌన్సిలర్ అల్కురి పావని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూత్రశాల నిర్మాణం కోసం స్థలాన్ని కమిషనర్ రాజయ్య, ఏఈ నాగశివ పాఠశాల సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు.

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండడంతో మూత్రశాలల కోసం ఇబ్బందులు పడుతుండటాన్ని మంత్రి దృష్టికి వార్డు కౌన్సిలర్ తీసుకెళ్లగా… వెంటనే రూ.30 లక్షల నిధులు కేటాయించారని, ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
స్థలం పరిశీలించిన వారిలో కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవికుమార్, కో ఆప్షన్ నెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, మార్కెట్ డైరెక్టర్ శాలం, రామ్ నారాయణ, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.