– ఎస్సై అశోక్ బాబు
నారాయణపేట,అక్టోబర్ 08( జన ఉదయం ప్రతినిధి )
మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓబుళపూర్ గేటు సమీపంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయిచూర్ లక్ష్మి (46) అనే భవన నిర్మాణ కార్మికురాలు తలకు బలమైన గాయం కావడంతో రక్తస్రావం జరిగి మృత్యు బారిన పడింది .
మాగనూర్ ఎస్సై పి. అశోక్ బాబు తెలిపిన వివరాల ప్రకారం… గుడెబల్లూర్ గ్రామానికి చెందిన రాయిచూర్ లక్ష్మి, ఆమె భర్త రాయిచూర్ లక్ష్మణ (51) కలిసి మఖ్తల్ కి కూలి పని నిమిత్తం వెళ్లి, తిరిగి సాయంత్రం తమ HF Delux బైక్ పై ఇంటికి వస్తున్నారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో ఓబ్లాపూర్ గేటు వద్ద అకస్మాత్తుగా ఒక కుక్క అడ్డం రావడంతో, బైక్ అతివేగంగా నడపడం వల్ల స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో లక్ష్మి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర రక్తగాయమైంది.
స్థానికులు ఆమెను అంబులెన్స్ ద్వారా మఖ్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతురాలి కుమారుడు ఆర్. రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాగనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
