Hydra News: గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు

Hydra news

హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నగరంలోని అత్యంత కీలక ప్రాంతమైన గచ్చిబౌలిలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా( Hydra) అధికారులు సోమవారం తొలగించారు. ముఖ్యంగా.. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్‌ సొసైటీ లేఅవుట్‌లో ఈ చర్యలు చేపట్టడం జరిగింది.

కోర్టు ఆదేశాలతో చర్యలు..

ఈ లేఅవుట్‌లో కొందరు వ్యక్తులు ఏకంగా రోడ్లను ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ లేఅవుట్‌లో రోడ్ల ఆక్రమణ జరిగింది అంటూ బాధితులు ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని హైడ్రా (Hydra) అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత ప్రక్రియను చేపట్టారు.

కూల్చివేత వివరాలు, అదనపు ఆక్రమణలు..

ఈ చర్యలో భాగంగా.. అధికారులు అనుమతులు లేని నాలుగు షెడ్లు, అలాగే నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని కూల్చేశారు. ఈ భవనం రోడ్డు మార్గాన్ని పూర్తిగా అడ్డుకుంటూ అక్రమంగా నిర్మించినట్టు గుర్తించారు. కేవలం రోడ్ల ఆక్రమణ మాత్రమే కాకుండా.. ఈ లేఅవుట్‌లలో చాలా చోట్ల ప్రభుత్వ భూములను, సామాజిక అవసరాల కోసం ఉంచిన స్థలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *