– నారాయణపేట్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం
నారాయణపేట, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి. మల్లారెడ్డి, బి. విజయకాంతరావు ఆదేశాల మేరకు, నారాయణపేట్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో, ఈ నెల 3 న మక్తల్ లోని కొత్త గార్లపల్లి మట్టి రోడ్డులో జరిగిన 5 కి.మీ మౌంటెన్ (అడవి) సైకిల్ పోటీలలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుండి 186 మంది బాలబాలికలు పాల్గొని, సైకిల్ పోటీలలో క్రీడా ప్రతిభను చాటి 32 మంది బాలబాలికలు, 7 మంది మహిళ పీఈటీలు ఎంపికయ్యారు. మహిళా పి ఈ టి లలో అవంతి, త్రివేణి, బాలమణి ,రేణుక ,రమ్య, స్వప్న, అనూష రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధాన కార్యదర్శి బి.గోపాలం తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి మౌంటెన్ సైకిలింగ్ పోటీలకు ఎంపికైన బాలబాలికలకు జిల్లా చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్ ప్రధాన కార్యదర్శి బి.గోపాలం మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన వారు, ఈనెల 5, 6 తేదీలలో హైదరాబాద్ శామీర్ పేట అడవుల్లో జరుగు రాష్ట్రస్థాయి సైకిల్ పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి, పి ఈ టి లు అవంతి, బాలమణి, రేణుక, స్వప్న, రమ్య, అనూష, వెంకటేష్, పరశురాం ,నరేష్ ,రమేష్, సైకిల్ రైడర్స్ పాల్గొన్నారు.
