విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో భారీ చోరీ

– వెనుక డోరు తాలాన్ని కట్ చేస్తూ మరమ్మతుల కేంద్రంలోకి జొరబడిన దొంగలు

– రూ. 2 లక్షల విలువచేసే కాఫరు, అల్యూమినియం చోరీ

– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఈ అశోక్ కుమార్

– సీసీ కెమెరాలతో బయటపడ్డ భాగవతం

– ట్రాన్స్ఫార్మర్ బుడ్డి తీసుకువచ్చిన పది మందిపై అనుమానం అంటున్న అధికారులు

నారాయణపేట, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)

నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణ శివారులోని 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ పక్కనే గల విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ల మరమతు కేంద్రంలో బుధవారం అర్థ రాత్రి ఒకటిన్నర గంటల ప్రాంతంలో భారీ చోరీ జరిగింది.
గురువారం రోజు యధావిధిగా మరమ్మతు కేంద్రానికి వచ్చిన అధికారులు, వర్కర్లు అక్కడున్న కాఫరు, అల్యూమినియం వైరు లేకపోవడంతో ఒక్కసారిగా శాకుకు గురయ్యారు. తీరా సీసీ కెమెరాలో పరిశీలించగా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతి కేంద్రం వెనకాల ఉన్న డోరు తాళాన్ని కట్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు స్టోర్‌రూమ్‌లోకి ప్రవేశించి సుమారు రూ.2 లక్షల విలువైన కాఫరు, అల్యూమినియం విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు . సబ్‌స్టేషన్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉన్నప్పటికీ గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దొంగతనం జరిగినట్టు అధికారులు గుర్తించారు . ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తుండగా.. వారిలో ఒకరు పంజాబీ దుస్తులు ధరించి ముఖముపై ప్లాస్టిక్ కవర్ను కప్పుకున్నట్టు సీసీ ఫుటేజీలో ఉన్నాయి. చోరీ అనంతరం బయటకు వెళ్లే సమయంలో ఆ వ్యక్తి ధరించిన దుస్తులను కాంపౌండ్ వాల్ బయట పడేసి వెళ్లినట్లు తెలుస్తోంది.

స్పందించిన విద్యుత్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు….

చోరీ జరిగి రెండు రోజులు అవుతున్న గోప్యంగా ఉంచడంలో అనేక అనుమానాలు తావిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి జరిగిన చోరీ సంబంధిత కాంట్రాక్టర్ శ్రీధర్ కలిసి పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేసినప్పటికీ శుక్రవారం నాటికి పాత్రికేయులకు సైతం తెలియని విషయం.గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి విద్యుత్ అధికారులు పోలీసులు మాత్రం పాత్రికేయులకు చెప్పకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు.
చోరీకి గురైన విద్యుత్ తీగలు సంబంధిత కాంట్రాక్టర్‌కు సంబంధించినవి. డిపార్ట్మెంట్ కు సంబంధించిన కావని అధికారులు తెలియజేస్తున్నారు.

ఇట్టి చోరీ తెలిసిన వ్యక్తుల పనేనా?

24 గంటల పాటు భద్రత, సిబ్బంది పర్యవేక్షణ ఉండే 132 కేవీ సబ్‌స్టేషన్‌ పక్కనే గల ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి విద్యుత్ తీగలను ఎత్తుకెళ్లడం అధికారులకు సవాల్‌గా మారింది. సబ్‌స్టేషన్‌పై అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ కాలేదు.

మక్తల్ పోలీసులకు సవాలుగా మారుతున్న దొంగతనాలు…

వారానికి, పది రోజులకు ఒకసారి మక్తల్ లో ఏదో ఒక సెన్సేషనల్ ఇష్యూస్ జరుగుతూనే ఉండటంతో మక్తల్ పోలీసులకు సవాల్ గా మారిందని ప్రజలు అంటున్నారు. అది దొంగతనాలు అయితే నేమి కోడి పందాలు అయితేనేమి పేకాటరాయులైతేనేమి యువత వ్యసనాలకు బానిసై చేస్తున్న అగత్యాలు అయితేనేమి ఇలా ఎన్నెన్నో మక్తల్ పోలీసులకు సవాలుగా మారుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

రాత్రివేళ పోలీసుల పహారా గట్టిగా ఉండాలి…

రాత్రివేళ పది గంటల తర్వాత పోలీసుల పహారా గట్టిగా చేస్తూ యువకులను ఆకతాయిలను బయట తిరగకుండా బందోబస్తు నిర్వహించవలసిన అవసరం పోలీసులపై ఎంతో ఉంది. కానీ ఒక యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన మరుసటి రోజు మక్తల్ పోలీసులు హల్చల్ చేస్తూ ఇళ్ళ ముందర ఉన్న వారిని సైతం పోలీస్ స్టేషన్ తీసుకురావడం కొంతమంది ప్రజలు చాలా బాధాకరంగా భావించారు. అసలు నేరస్తులను వదిలి తమ ఇంటి ముందర ఉన్న మమ్ములను తీసుకెళ్లడం ఏంటి అని ప్రశ్నించారు కూడా. ఏదో రాత్రివేళ బలమైన సంఘటన జరగడంతో ఆ వీధి ప్రజలు భయాందోళనకు గురవుతూ వీధిలో ఉన్న వాళ్లంతా నిద్రపోకుండా రాత్రివేళ లేచి ఉంచడం ఒకరు ధైర్యంగా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవైపు పోలీసులు గాలించడం పోలీసుల పహారా చేయడము గస్తీ చేయడము మంచిదైనప్పటికీ ఇది నిరంతర ప్రక్రియగా ఉంటే బాగుంటుంది. ఏదో సెన్సేషనల్ ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే హల్చల్ చేయడము పోలీసులకు తగలడంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత వారికి సహకరించడమే ప్రజల యొక్క బాధ్యత కూడా అని చెప్పక తప్పదు. పోలీసులు కూడా మనుషులే అయినప్పటికీ బాధ్యతాయుతంగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు రావని ప్రజలు భావిస్తున్నారు. నాయకులకు ఒక గౌరవం మామూలు వ్యక్తులకు ఒక గౌరవం కాకుండా చట్టంలో అందరు సమానులే అన్నది భావించవలసిన అవసరం పోలీసులపై ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసు అన్న పదానికి వారు చేస్తున్న వాటికి అర్థము లేకుండా పోతుందని ప్రజలు భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.