లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం

– 120 మందికి కంటి వైద్య పరీక్షలు

– 45 మందిని కంటి ఆపరేషన్లపై తరలింపు

– లైన్స్ క్లబ్ కార్యదర్శి అధ్యక్షులు ఎస్ రమేష్ రావు

నారాయణపేట, సెప్టెంబర్ 4 (జన ఉదయం ప్రతినిధి)

లైన్స్ క్లబ్ ఆఫ్ మక్తల్ భీమా ఆధ్వర్యంలో శుక్రవారం మక్తల్ పట్టణంలోని లైన్ భవనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైనది. లైన్స్ క్లబ్ కార్యదర్శి
లయన్ S. రమేష్ రావు mjf అధ్యక్షతన,
లయన్ అనుగొండ శ్రీనివాసులు డిస్ట్రిక్ విజన్ ఛైర్మెన్ ఆధ్వర్యంలో రామ్ రెడ్డి లయన్స్ కంటి ఆస్పత్రి ఎనుగొండ మహబూబ్నగర్ వారి సహకారంతో ఉచిత కంటి శస్త్ర చికిత్స పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగినది.
ఇట్టి శిబిరంలో కంటి నిపుణు రాలు జ్యోతి 120 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 45మందికి ఉచిత కంటి ఆపరేషన్ కొరకు మహబూబ్నగర్ రామిరెడ్డి లైన్స్ కంటి ఆసుపత్రికి బస్సులో పంపడం జరిగినది. వారికి ఉచిత భోజన వసతి సదుపాయాలతో ఆపరేషన్ చేసి ఉచితంగా బస్సులో సెప్టెంబర్ 6 వ తేదీ నాడు మక్తల్ కు తిరిగి పంపడం జరుగును.
ఇట్టి కార్యక్రమంలో లయన్ సభ్యులు
బి అంబాదాసు రావు కోశాధికారి , సత్య ఆంజనేయులు,
జి పాపిరెడ్డి ,కాకులారం అశోక్,
పృథ్వీరాజ్, అంజన్ ప్రసాద్ పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.