నారాయణపేట, సెప్టెంబర్ 10 (జన ఉదయం ప్రతినిధి)
ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం లో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ లో మక్తల్ నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ పాల్గొని పూలమాలలు వేసి ఆమె ఆశయ సిద్ది కొరకు తోడ్పడతానంటూ నినదించారు. అందుకే అన్నకి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖంగా నిలిచిన ధీర మహిళ. ఆమె భూస్వామ్య, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి, పేదలు మరియు రైతుల హక్కుల కోసం ధైర్యంగా నిలిచారు.
చాకలి ఐలమ్మ 10 సెప్టెంబర్ 1985న మరణించారు. అందువల్ల ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ఆమె వర్ధంతిని నిర్వహిస్తారు.
విగ్రహాలు: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆమె స్మారకంగా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆమె విగ్రహం సాధారణంగా చేతిలో చాకలి పనికి సంబంధించిన వస్తువులు/బట్టలు లేదా వీరనారి రూపాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.
ఐలమ్మ పోరాటం తెలంగాణ రైతాంగ ఉద్యమం, మహిళా ధైర్యం మరియు సామాజిక న్యాయానికి ప్రతీకగా గుర్తించబడుతుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ జనసైనికులు రామన్ గౌడ్ గౌడి బాల్ రెడ్డి పరుశురాం నవీన్ మక్తల్ పట్టణ చాకాలి పెద్దలు బాలప్ప శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
