శ్రీ స్వయంభూ బండ తిరుమలయ్య స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠా మహోత్స వాలు

– ఈనెల 12వ తేదీ శనివారం రోజు విశేష పూజా కార్యక్రమాలు

– భక్తులందరూ ఆహ్వానితులే

– ఉభయ రాష్ట్రాల ధర్మ ప్రచార కార్యదర్శి విద్వాన్ కే రాఘవేంద్ర చార్య

నారాయణపేట, సెప్టెంబర్ 10 (మన ఉదయం ప్రతినిధి)

మక్తల్ నియోజకవర్గ పరిధిలోని కర్నీ రోడ్‌, పంపు హౌస్ దగ్గర గల అతి పురాతన దేవాలయం అయినటువంటి శ్రీ స్వయంభూ బండ తిరుమలయ్య స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవ విశేష పూజా కార్యక్రమాలు ఈనెల 12వ తేదీ శనివారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఉభయ రాష్ట్రాల ధర్మ ప్రచార కార్యదర్శి విద్వాన్ కే రాఘవేంద్ర చార్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి యొక్క క్షేత్రమైన విశేషాలు ఎంతో ఆధ్యాత్మిక శోభన సంతరించుకుని ఉన్నాయి.

క్షేత్ర మహాత్మ్యం:

మక్తల్‌ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన పవిత్ర క్షేత్రంగా శ్రీ స్వయంభూ బండ తిరుమలయ్య స్వామి దేవాలయం భక్తుల విశ్వాసంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారు బండపై స్వయంభూ స్వరూపంగా వెలసినందున భక్తులు ప్రేమతో “బండ తిరుమలయ్య స్వామి” అని పిలుచుకుంటారని స్థానికంగా ప్రతీతి. “బండ తిరుమలయ్య” అనే పేరులో విశిష్టత “తిరుమలయ్య” పేరుతో ప్రసిద్ధి చెందిన కొన్ని క్షేత్రాలలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారు శిల, బండ లేదా గుట్టపై వెలసిన స్వరూపంలో దర్శనమిస్తారని భక్తులలో విశ్వాసం ఉంది. అటువంటి బండపై వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారిని ప్రేమతో “బండ తిరుమలయ్య” అని పిలుచుకునే సంప్రదాయం ఉంది.

తిరుమలయ్య చెరువు:

ఈ ఆలయానికి సమీపంలోని “తిరుమలయ్య చెరువు” కూడా స్వామివారి పేరుతోనే ఏర్పడిన పేరుగా స్థానికంగా తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు.

పూర్వకాలపు మొక్కు సంప్రదాయం:

పూర్వకాలంలో భక్తులు స్వామివారిని మొక్కుకుని, తమ కోరిక నెరవేరిన అనంతరం తిరిగి క్షేత్రానికి వచ్చి మొక్కు తీర్చుకునేవారని స్థానిక సంప్రదాయం చెబుతోంది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోని సహజసిద్ధమైన బండరాళ్ల పైనే ఆకులు, పాత్రలు లేకుండా అన్నప్రసాదాన్ని స్వీకరించడం ఒక ప్రత్యేకమైన భక్తి సంప్రదాయంగా ఉండేదని పెద్దలు చెబుతారు.

వరప్రదుడైన స్వామివారు:

సంతాన ప్రాప్తి, వివాహం, సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు మరియు కోరిన కోరికలు నెరవేరాలని భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తారు. భక్తుల విశ్వాసానికి, మొక్కులకు, ప్రార్థనలకు బండ తిరుమలయ్య స్వామివారు కొంగుబంగారమై నిలుస్తారని భక్తుల నమ్మకం.

శిథిలావస్థ నుంచి పునర్వైభవం ఒకప్పుడు ఆలయం అత్యంత శిథిలావస్థకు చేరుకుని, పునర్నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఆలయ దుస్థితిని చూసి చలించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వాకిటి శ్రీహరి గారి సోదరులు శ్రీ వాకిటి శేషగిరి గారు, “ఈ దేవాలయ పునర్నిర్మాణానికి నా పూర్తి సహకారం అందిస్తాను.” అని ముందుకు వచ్చారు. ఆ మాటను కార్యరూపంలోకి తీసుకువచ్చి ఆలయ పునర్నిర్మాణానికి విశేషమైన, ప్రధానమైన సహకారాన్ని అందించి, స్వామివారి ఆలయానికి తిరిగి వైభవాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వారి భక్తి, సేవాభావం, సహకారానికి ఆలయ భక్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. పునర్నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి దాతకు, భక్తునికి, శ్రేయోభిలాషికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలియజేశారు విద్వాన్ రాఘవేంద్ర చార్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.