– 167 వ జాతీయ రహదారిపై రాస్తారోకో
– రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలంటూ ధర్నా
– నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
నారాయణపేట, సెప్టెంబర్ 10 (జన ఉదయం ప్రతినిధి)
నారాయణపేట బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం మక్తల్ మండలం జక్లేర్ సబ్ స్టేషన్ మరి నేషనల్ హైవే 167 రోడ్డుపై రాస్తారోకో చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సంఘం మండ బలరాం రెడ్డి మాట్లాడుతూ రైతులకు 24 గంటల కరెంటు సప్లై చేయాలని , నారాయణపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని , పంటలు వేసిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని , పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సంబంధిత విద్యుత్ అధికారులు విద్యుత్ కోత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాలు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గోవర్ధన్ గౌడ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి బలరాం రెడ్డి , ఉపాధ్యక్షులు కర్ణ స్వామి , BJYM జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ , BJYN జిల్లా ఉపాధ్యక్షుడు వావిళ్ళ రవి కుమార్ రెడ్డి , జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దుబ్బల హనుమంతు , బీజేపీ జిల్లా నాయకులు వావిళ్ళ నరేందర్ రెడ్డి , వివిధ మండల పార్టీ అధ్యక్షులు , వివిధ మోర్చా లఅధ్యక్షులు , రైతులు , యువకులు , బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
