మక్తల్ లో కొనసాగుతున్న స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ వారోత్సవాలు

– వివేకానంద వ్యవస్థాపక కమిటీ,ఏబీవీపీ ఆధ్వర్యంలో మహనీయుల విగ్రహాలకు జలాభిషేకం,పూజా కార్యక్రమం…

నారాయణపేట, సెప్టెంబర్ 15 (జన ఉదయం ప్రతినిధి)

మఖ్తల్ పట్టణం స్వామి వివేకానంద చౌరస్తాలోని స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహ వ్యవస్థాపక కమిటీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా రెండవ రోజు అయినా మంగళవారం మఖ్తల్ పట్టణంలోని మహనీయులందరి విగ్రహాలకు జలాభిషేకం గావించి పూజా కార్యక్రమం నిర్వహించారు.

మఖ్తల్ బసవేశ్వర సర్కిల్ నుండి వాసవి మాత ఆలయం వరకు నెలకొల్పి ఉన్న బసవేశ్వరుడు, చాకలి ఐలమ్మ, భగత్ సింగ్ , అంబేద్కర్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాల పరిసరాలు శుభ్రం చేయడంతో పాటు జలాభిషేకం గావించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వివేకానంద విగ్రహ వ్యవస్థాపక కమిటీ సభ్యులు వివిధ క్షేత్రాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.