ఈనెల 17న మక్తల్ లో ఘనంగా విశ్వకర్మ జయంతి మహోత్సవాలు – ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్ర – ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు – విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి) విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని ఈనెల 17వ తేదీన మక్తల్ పట్టణం, పరిసర గ్రామాల ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . విశ్వకర్మ సమాజానికి చెందిన కమ్మర, వడ్రంగ, కంచర, శిల్పి, స్వర్ణకార తదితర వృత్తులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్యదైవంగా భావించబడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడిందని తెలిపారు . ఈనెల 17న మక్తల్ పట్టణంలోని మునేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు భక్తులకు స్వామివారి దర్శనం, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శోభయాత్ర కార్యక్రమం…. పట్టణంలోని శ్రీ నల్లజానమ్మ దేవాలయం నుంచి మేళతాళాలతో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు అధ్యక్షులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు. విశ్వకర్మ భగవానుడు సృష్టి నిర్మాణానికి ప్రతీకగా, కళాకారులు, శిల్పులు, వృత్తి నిపుణులకు ఆదర్శదైవంగా కొలవబడుతున్నారని పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు విశ్వకర్మ సమాజ ఐక్యతను చాటేలా ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వకర్మ జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని భక్తులు, విశ్వబ్రాహ్మణులు, హిందూ బంధువులు, పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధ్యక్షులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు .

– ఆలయంలో ప్రత్యేక పూజలు, శోభాయాత్ర – ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాట్లు

– విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు

నారాయణపేట, సెప్టెంబర్ 16 (జన ఉదయం ప్రతినిధి)

విశ్వకర్మ భగవానుని జయంతిని పురస్కరించుకుని ఈనెల 17వ తేదీన మక్తల్ పట్టణం, పరిసర గ్రామాల ప్రజల సంయుక్త ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . విశ్వకర్మ సమాజానికి చెందిన కమ్మర, వడ్రంగ, కంచర, శిల్పి, స్వర్ణకార తదితర వృత్తులకు విశ్వకర్మ భగవానుడు ఆరాధ్యదైవంగా భావించబడుతున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏర్పడిందని తెలిపారు .

ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

శోభయాత్ర కార్యక్రమం….

పట్టణంలోని శ్రీ నల్లజానమ్మ దేవాలయం నుంచి మేళతాళాలతో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించనున్నట్లు అధ్యక్షులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.
విశ్వకర్మ భగవానుడు సృష్టి నిర్మాణానికి ప్రతీకగా, కళాకారులు, శిల్పులు, వృత్తి నిపుణులకు ఆదర్శదైవంగా కొలవబడుతున్నారని పేర్కొన్నారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు విశ్వకర్మ సమాజ ఐక్యతను చాటేలా ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

విశ్వకర్మ జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని భక్తులు, విశ్వబ్రాహ్మణులు, హిందూ బంధువులు, పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధ్యక్షులు శ్రీనివాసులు పిలుపునిచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

జన ఉదయం మరింత మందికి చేర్చండి.